చెన్నై: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు) ప్రాజెక్టుపై తీర్పును  ఎన్జీటీ చెన్నై ధర్మాసనం రిజర్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుపై మంగళవారం నాడు ఇరు వర్గాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ చెన్నై ఎన్జీటీ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. 

also read:పోతిరెడ్డిపాడు: ఏపీ, తెలంగాణల్లో హీటెక్కిన రాజకీయాలు

ఈ పిటిషన్ పై ఇరు వర్గాలు తమ వాదనలను విన్పించాయి. 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు ఎత్తిపోసేలా మార్చారన్న పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్ఠంగా నివేదిక ఇచ్చిందిన తెలిపిన పిటిషనర్ తరపు న్యాయవాది ఆరోపించారు. 
రాయలసీమ ఎత్తిపోతల పథకం పాతదేనన్న ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదించారు. 

తమ వాటా నీటిని మాత్రమే తాము వాడుకొనేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిపాదించినట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.అంతేకాదు కేసును ముగించాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వెంకటరమణి కోరారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్ అఫిడవిట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ప్రభుత్వం తెలిపింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైఖరిని తెలపాలని కేంద్ర పర్యావరణ శాఖను నేషనల్ గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.ఈ కేసులో తీర్పును ఎన్జీటీ చెన్నై ధర్మాసనం ఆదేశించింది.