Asianet News TeluguAsianet News Telugu

దేవుడా .. కన్నడ ఓటర్ల తీర్పులో ఇన్ని ట్విస్ట్ లా?

క్షణం.. క్షణం.. టెన్షన్ టెన్షన్

new twist in karnataka elections

కన్నడ ఓటర్లు కనీ విని ఎరుగని రీతిలో తీర్పు ఇచ్చారు. పోటీ చేసిన ఏ పార్టీని బాధపెట్టలేదు. పోటీ చేసిన ఏ పార్టీకి గుండుగుత్తగా సంతోషం పంచలేదు. తలా ఇంత బాధను, తలా ఇంత సంతోషాన్ని పంచి సమానత్వం పాటించారు కన్నడిగులు. ఇంతగా ఎందుకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చారో తెలుసుకుందాం రండి.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచి దేశ ప్రజల్లో ఆసక్తిని రేపాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. తర్వాత ట్రెండ్ బిజెపి  వైపు మళ్లింది. బిజెపి బాగానే దూసుకుపోయింది. తీరా 114 వరకు సాధిస్తుందని అనుకుంటున్న దశలో బిజెపికి 10 సీట్లు కోతపడ్డాయి. 104 దగ్గర ఆగిపోయింది. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు సీట్లు ఎక్కువే వస్తాయనుకుంటున్నవేళ 8 సీట్లు మైనస్ అయ్యాయి. సో బిజెపి సొంతంగా అధికారంలోకి వచ్చే చాన్స్ లేదు. ఇక్కడ బిజెపికి అధికారం ఇవ్వకుండా బాధపెట్టిన కన్నడిగులు బిజెపికి అసెంబ్లీలో వందకు పైగా అంటే అత్యధిక సీట్లు ఇచ్చి కొద్దిగా సంతోషం పంచారు.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, సర్వేలు చెప్పాయి. ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. కానీ ఫలితాల్లో కాంగ్రెస్ అనూహ్యంగా వెనుకబడింది. ఆ పార్టీకి 78 సీట్లే వచ్చాయి. ఇక అధికారం చేజారిపోయిందన్న బాధను మిగల్చారు కన్నడ ఓటర్లు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కు కూడా ఒక సంతోషాన్ని మిగిల్చారు. బిజెపికి అత్యధిక సీట్లు ఇచ్చి సంతోషం పంచినట్లే కాంగ్రెస్ కు అత్యధిక ఓట్లు ఇచ్చి కొద్ది సంతోషాన్ని పంచారు. అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు ఎక్కువ. (పూర్తి లెక్కలు అందాల్సి ఉంది.)

ఇక జెడిఎస్ హంగ్ లో కింగ్ అని మొదట కొన్ని సర్వేలు చెప్పాయి. తర్వాత జెడిఎస్ తో అవసరమే లేకుండా అధికారాన్ని చేజిక్కించుకుంటామని బిజెపి ప్రకటించింది. ఒక దశలో జెడిఎస్ గత సీట్లను కూడా నిలుపుకుంటుందా లేదా అన్న అనుమానాలు కలిగాయి. సీట్లు, ఓట్లు రెండూ జెడిఎస్ కు తక్కువగానే వచ్చాయి. ఈ విషయంలో జెడిఎస్ ను బాధపెట్టిన కన్నడ ఓటర్లు అంతిమంగా జెడిఎస్ పార్టీకి సిఎం సీటు ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ మేరకు జెడిఎస్ ను సంతోష పెట్టారు. జెడిఎస్ కు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. జెడిఎస్ కు సిఎం పోస్టు, కాంగ్రెస్ కు ఉపముఖ్యమంత్రి పోస్టు తీసుకుంటారని, 14 మంది మంత్రులు జెడిఎస్ వారు, 20 మంది మంత్రులు కాంగ్రెస్ వారు పంచుకుంటారని అప్పుడే టాక్ నడుస్తోంది.

ఈ నేఫథ్యంలో ఇప్పటికే ఒక పోస్టు కన్నడ ఫలితాల మీద వైరల్ అవుతోంది. ఆ పోస్టు కింద ఉంది చూడండి.

new twist in karnataka elections

Follow Us:
Download App:
  • android
  • ios