Asianet News TeluguAsianet News Telugu

బ్యూటీషియన్ శిరీష కేసులో కొత్త మలుపు


బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా భావిస్తున్న ఫోన్ రికార్డింగ్ లను పోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. శిరీష్ మొబైల్ ఫోన్ లో వందల సంఖ్యలో కాల్ రికార్డ్  లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శిరీష ఎవరెవరితో ఫోన్ మాట్లాడినప్పుడు రికార్డు చేసిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

new twist in beautician shirishas deth case

అన్ని రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన తర్వాత అక్కడి నుంచి రిపోర్ట్ రాగానే కేసులో మరింత క్లారిటీ  వస్తుందని  పోలీసులు  అంటున్నారు. మరోవైపు శిరీష ఫోన్ రికార్డింగ్ లను ఇప్పటికే కొన్ని మీడియాకు లీక్ కావడం చర్చనీయాంశమైంది. మీడియాలో శిరీష పలువురితో మాట్లాడినట్లు ఫోన్ రికార్డింగ్ లను ప్రసారం అవుతుండడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుంటున్నారు.

 

రాజీవ్ కు తనకు మధ్య అడ్డుగోడగా ఉన్న తేజస్విని దూరం చేసేందుకు శిరీష సీరియస్ గానే ప్రయత్నాలు చేసిందన్నది ఇప్పటికే లీకైన ఆడియో టేపుల ద్వారా తెలుస్తోంది. రాజీవ్ కొంతకాలం పాటు శిరీషను దూరం పెట్టడానికి తేజస్విని కారణమని భావించిన శిరీష రకరకాల ప్రయత్నాలు చేసినట్లు ఆడియో  టేపులను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఆమె పాత స్నేహితులను, ఫేస్ బుక్ స్నేహితులను ఈ పనికి వాడుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

 

బ్యూటీషియన్ శిరీష మరణించిన కారణంగానే ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఎస్సై ఆత్మహత్యపై మరింత లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. దీంతోపాటు శిరీష  దుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి రావడంతో ఈ కేసు మరోవైపు టర్న్ తీసుకుంది. ఆమెపై అత్యాచారం జరిపారా లేదా అన్నదానిపై కూడా ఫొరెన్సిక్ ల్యాబ్ కు ఇప్పటికే శిరీష రక్తపు మరకలతో కూడిన దుస్తులను ఫొరెన్సిక్ ల్యాబ్ కు అందజేశారు. ఆ రిపోర్టు కూడా పోలీసులకు అందిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

 

దీనికితోడు శిరీష కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకోనేలేదని ఆమెను హత్య చేశారంటూ ఇంకా వారు వాదిస్తూనే ఉన్నారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తి తేజస్విని ని సైతం విచారించాలని వారు కోరుతున్నారు. మొత్తానికి ఫొరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తర్వాత శిరీష, ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణాలపై మరింత స్పస్టత రావొచ్చంటున్నారు పోలీసులు.

Follow Us:
Download App:
  • android
  • ios