ప్రియాంక రెడ్డి హత్య కేసుతో హైదరాబాద్ నగరం ఉలికిపడింది. నలుగురు దుండగులు  స్కూటీ రిపేరు పేరుతో... ఆమెను ట్రాప్ చేసి అతికిరాతకంగా హత్య చేశారు. ఆమె హత్య కేసు విషయంలో... నిందితులపై మండిపడటంతోపాటు... పోలీసుల నిర్లక్ష్యంపై  కూడా మండిపడుతున్నారు.

Alsoread చంపేశాక కూడా వదల్లేదు... ప్రియాంక రెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు...

మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. తప్పిపోయింది యుక్త వయ స్సు వారైతే ఉద్దేశపూర్వకంగానే ఎవరితోనో కలిసి వెళ్లిపోయి ఉంటారని, పెద్ద వయస్సు వారు అయి తే కుటుంబీకులతో ఉండటం ఇష్టం లేక దూరమై ఉంటారని చెప్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి

ప్రియాంక మిస్సింగ్‌ కేసు దర్యాప్తులోనూ సైబరాబాద్‌ పోలీసులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శించారని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన తర్వాత.. పోలీసులు అవమానకరంగా, హేళనగా మాట్లాడినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. 

‘మీ బిడ్డ ఎవరితోనైనా వెళ్లిందేమో? లవర్‌ తీసుకెళ్లాడేమో? ఎక్కడకీ పోదులే.. తిరిగి ఇంటికి వస్తుందిలే’ అంటూ వ్యాఖ్యలు చేసి వారిని మనోవేదనకు గురి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు టోల్‌ప్లాజా వద్దకు వచ్చి సీసీ కెమెరాల ఫుటేజ్‌ చూస్తూ కాలక్షేపం చేశారే తప్ప సరైన దిశలో కేసును దర్యాప్తు చేయలేకపోయారని నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read:ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

ఉదంతం తీవ్రతను, పూర్వాపరాలను కుటుంబీకులు వివరించి లారీడ్రైవర్ల ప్రమేయంపై అనుమా నం కూడా వ్యక్తం చేశారు. అప్పుడైనా రంగంలోకి దిగి శంషాబాద్‌తో పాటు పక్కన ఉన్న షాద్‌నగర్‌ అధికారులను అప్రమత్తం చేసి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేదికాదు కదా అంటున్నారు. అనుమానిత ప్రాం తాల్లో పోలీసు వాహనాలతో పెట్రోలింగ్‌ నిర్వహించినా నిందితులు మృతదేహంతో సహా దొరికేవా రు. అలా చేయకపోవడంతోనే నిందితులు మృతదేహాన్ని లారీలో పెట్టుకుని దాదాపు 30 కి.మీ. ప్ర యాణించగలిగారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్