డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతం.... నగరవాసులను కలవరానికి గురిచేసింది. ఆమె హత్య కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... హత్య చేసే సమయంలో ఆమెను ఎంత టార్చర్ చేశారో పోలీసులు వివరించారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.

Also Read:ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

నలుగురు దుర్మార్గులు ప్రియాంక  పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించారు. దాదాపు 45 నిమిషాలపాటు.. ఆమెపై అకృత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దుండగులు ప్రియాంకకు బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకానికి పాల్పడటం గమనార్హం..

బాధితురాలు ప్రియాంక తన స్కూటీ కోసం ఎదురుచూస్తుండగా.. మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, నవీన్ లు ఆమెను బలవతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు సహాయం కోసం ఎంత అరిచినా... వాహనాల రాకపోకల శబ్ధంలో ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు.

Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్

దుండగులు ఆమె నోరు నొక్కి.. దూరంగా లాక్కెల్లారు. కొంతసేపటి తర్వాత స్కూటీ తీసుకొచ్చిన శివ కూడా వారికి జత కలిశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు ప్రతిఘటిచంకుండా ఉండేందుకు ఆమె చేత కూడా బలవంతంగా మద్యం తాగించారు.

ఒకరి తర్వాత మరొకరు ఆమె తమ కామ వాంఛ తీర్చుకున్నారు. అప్పటికే ఆమె అచేతన స్థితిలోకి వెళ్లిపోగా... ముక్కు, నోరు మూసి హత్య చేశారు. చనిపోయాక కూడా ఆమెను వదలకపోవడం బాధాకారం. ఆమె శవాన్ని లారీ క్యాబీన్ లోకి ఎక్కించి... మార్గ మధ్యంలో కూడా ఆమెపై పలు మార్లు దారుణానికి పాల్పడ్డారు.

Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి

తొలుత ప్రియాంక ప్యాంట్ లేకుండానే లారీ క్యాబీన్ లోకి మృతదేహాన్ని ఎక్కించారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకరు కిందకు వెళ్లి ప్యాంటు తీసుకువచ్చి మళ్లీ తొడిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో ప్రియాంక లో దుస్తులు, పర్సు, చెప్పులు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా... నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు వాదనలు వినపడుతున్నాయి. అయితే... పోలీసులు మాత్రం నిందితులంతా 20ఏళ్ల పైబడినవారే అని చెబుతున్నారు.