హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నిరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకరెడ్డి దారుణ ఘటనను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ విచారణ నిమిత్తం సభ్యురాలు శ్యామలను పంపించింది. 

విచారణలో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన తీరును పరిశీలించిన శ్యామల పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. ప్రధాన రహదారిపై పోలీసులు లేకపోవడం విచారకరమన్నారు. పోలీసులు ముందే కోలుకుని ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. 

ప్రియాంకను కాపాడలేకపోయినందుకు విచారిస్తున్నాం: సీపీ సజ్జనార్

ఇకపోతే సీసీ కెమెరాల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు శ్యామల. పనిచేయని సీసీ కెమెరాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని నిలదీశారు. ఘటనపై విచారణ జరుగుతున్న తరుణంలో అత్యాచారం జరిగిన ప్రదేశంలో గోడను కూల్చడంపై మండిపడ్డారు. స్థలయజమాని నాగరాజుకు నోటీసులు జారీ చేశారు. 

అనంతరం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల ప్రియాంకరెడ్డి నివాసానికి వెళ్లారు. కుటుం సభ్యులను పరామర్శించారు. ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యం, ఘటన జరిగిన తీరుపై ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు శ్యామల. 

అనంతరం సైబరాబాద్ పోలీసులతో కూడా శ్యామల భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సైతం ఈ ఘటనపై సీరియస్ గా ఉండటంతో కేసు విచారణను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం ఉంది. 

priyanka murder case: మా నిర్లక్ష్యం ఎక్కడా లేదు... ఆరోపణలపై పోలీసుల వివరణ