ప్రియాంక కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేయగానే... పోలీసులు స్పందించి ఉంటే.. ఇంత ఘోర జరిగి ఉండేదని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రియాంక తల్లిదండ్రులు, బంధువులు ఈ విషయాన్ని మీడియా ముఖంగా చెబుతూనే ఉన్నారు. కాగా.... తామెలాంటి నిర్లక్ష్యం చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్

ప్రియాంక కేసులో పోలీసులు ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించలేదని సీపీ సజ్జనార్‌ స్పష్టంచేశారు. ఆమె తల్లిదండ్రులు శంషాబాద్‌ పీఎస్‌కు 11 గంటల సమయంలో వచ్చారని, 11.25 నిమిషా లకు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. 12 గంటలకు పెట్రోలింగ్‌ సిబ్బంది టోల్‌గేట్‌ వద్దకు వెళ్లారని, అయితే ఏ టోల్‌గేట్‌ నుంచి ఆమె వచ్చిందో తెలుసుకోవడానికి కాస్త సమయం పట్టిందన్నారు. 

AlsoRead ప్రియాంకరెడ్డి హత్య...పోలీసుల నిర్లక్ష్యంపై నెటిజన్ల మండిపాటు...

సీసీ ఫుటేజీలో ఆమె వెళ్లడమే ఉంది గానీ, రావడం లేకపోవడంతో గాలింపునకు 10 బృందాలను రంగంలోకి దించినట్టు చెప్పారు. ఉదయం 3 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, తెల్లవారుజామున 5 గం టల వరకు ప్రియాంక తండ్రితో కలిసి అన్ని బం కులు, పంక్చర్‌ షాపుల్లో గాలించినట్టు వివరించా రు. 

కాగా... నిన్న సాయంత్రమే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ రోజు వాళ్లని మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నలుగురు నిందితులను ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.