Asianet News TeluguAsianet News Telugu

ఈ నల్లగొండ పోరగాళ్ల డ్యాన్స్ దుమ్ము రేపింది (వీడియో)

  • వర్క్ విత్ డ్యాన్స్ ఫార్ములా 
  • కడపలో చిందేసిన నల్లగొండ యూత్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన డ్యాన్స్
nalgonda yoth super dance in rayalaseema

ఈ పోరగాళ్లందరూ నల్లగొండ జిల్లాకు చెందిన వారు. వీళ్లంతా కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం పరిసరాల్లో రోడ్డు పనులు చేస్తున్నారు. అక్కడ నెలల తరబడి పని ఉండడంతో అక్కడే మకాం వేశారు. రోడ్డు పనులు చేస్తూ అలసట వచ్చినప్పుడు ఆటవిడుపు కోసం.. కష్టం మరచిపోయేందుకు.. ఎంటర్ టైన్ మెంట్ కోసం మధ్య మధ్యలో పనిచేసేచోటే డ్యాన్స్ లు చేస్తూ రిలాక్స్ అవుతున్నారు.

నల్గగొండ జిల్లాలోని నకిరేకల్ పరిసర గ్రామాలైన పాలెం, మనిమద్దె, గురజాల, కురుమర్తి గ్రామాలకు చెందిన వారు. వీరంతా వడ్డెర కులానికి చెందిన యువకులే. పనికోసం కడప జిల్లా వెళ్లారు. బొంత చిరంజీవి, ఆలకుంట్ల ప్రశాంత్, ఆలకుంట్ల నరేష్, ఆలకుంట్ల సందీప్, కుంచం బాలరాజు, శివరాత్రి ఆంజనేయులు బొంత మల్లేష్, ఆలకుంట్ల తిరుమలేష్. గత రెండు నెలలుగా కడప జిల్లాలోనే పనులు చేస్తున్నారు.

రోడ్డు పనులు చేస్తున్న చోట తాము పనిలో ఉపయోగించే పనిముట్లను వాడుకుని డ్యాన్స్ చేశారు. వాటిని వాయిస్తున్నట్లు నటించారు. ఒక మాస్ మసాలా సాంగ్ ను పెట్టుకుని ఆ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ అదరగొట్టారు. యాక్షన్.. కట్.. టేక్ అంటూ చేసే డ్యాన్స్ లకంటే వంద రెట్లు ఈ శ్రమ జీవుల డ్యాన్స్ అద్భుతంగా ఉందని జనాలు అంటున్నారు. ప్రస్తుతం వీళ్ళు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరూ చూడండి కింద ఈ వీడియో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios