కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా హైదరాబాద్ లోని బ్యూటీషియన్ శిరీష మృతికి ఎస్సై ప్రభాకర్ రెడ్డికి మధ్య లింక్ ఉందని కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు పోలీసులు. శిరీష భర్త సతీష్ చంద్ర కూడా శిరీష చనిపోయిన తర్వాత పోలీసులు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారాయన.

బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన శిరీష మృతి ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా శిరీష మృతికి, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు సబంధం ఉందని చెబుతున్నారు.

ఆదివారం అర్థరాత్రి ఎస్సై ప్రభాకర్ రెడ్డి... శిరీష పనిచేస్తున్న బ్యూటీపార్లర్ లోనే ఉన్నారని సమాచారం అందుతోంది. శిరీష భౌతికఖాయం లభ్యమైన స్టూడియో యజమాని రాహుల్ కూడా రాత్రి ఘటనా స్థలంలోనే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

రాహుల్ తో పాటు అతడి స్నేహితుడు శ్రావన్, ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూడా శిరీష చనిపోయే ముందు స్టూడియోలోనే ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు కుకునూరుపల్లి ఎస్సై ఆత్మహత్యపై ఆయన స్వగ్రామం యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం, టంగుటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎస్సై బంధువులతోపాటు గ్రామస్థులంతా కుకునూరుపల్లికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు.

ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన బంధువులు ఓ టివి ఛానెల్ ఓబి లైవ్ వ్యాన్ తగలబెట్టారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి చనిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు శిరీషది హత్యా... ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.