Asianet News TeluguAsianet News Telugu

రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువ రూ.274 కోట్లు.. పాల్వాయి స్రవంతి ఆస్తులు ఎంతంటే...

మునుగోడు బీజేపీ అభ్యర్థి మాజీ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తుల విలువను ఎన్నికల అఫిడవిట్ తో సమర్పించారు. 

Munugodu Bypoll 2022 : Rajagopal Reddy's assets value is Rs. 274 crores
Author
First Published Oct 11, 2022, 8:33 AM IST

నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఆస్తులు, అప్పులతో పాటు పోలీసు కేసులు వివరాలతో కూడిన ఎన్నికల అఫిడవిట్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సోమవారం ఆయన చండూరులో నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి పేరుపైన ఉన్న ఆస్తుల విలువ రూ.152కోట్ల 69 లక్షల 94వేలు  కాగా,  ఆయన భార్య లక్ష్మీ పేరున రూ.48,55,25,250  కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి.

నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో  వ్యవసాయ భూములు, రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, హైదరాబాదులో ప్లాట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి పేరుపై ఉన్న చరాస్తుల విలువ సుమారు రూ. 274 కోట్లు. బ్యాంకులో అప్పు రూ.61,84,80,220 ఉన్నట్లు చూపారు. 

ఆ ఎనిమిది గుర్తులు కేటాయించొద్దు: ఈసీని కోరిన టీఆర్ఎస్

కాగా, 2014లో మునుగోడు నుంచి పోటీ చేసినప్పుడు రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వున్న స్థిరాస్తుల విలువ రూ. 47 కోట్లు కాగా,  చరాస్తుల విలువ రూ.265కోట్లు  ఉంది.  అదే విధంగా 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరు పై ఉన్న  స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.198 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు.

పాల్వాయి స్రవంతి ఆస్తుల విలువ ఎంతంటే…
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున డిసీసీ   అధ్యక్షుడు శంకర్ నాయక్ నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో పేర్కొన్న ప్రకారం స్రవంతి పేరుపై రూ.25,71,52,390 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. ఆమె భర్త పేరుపై రూ.15,13,25,804 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చూపించారు. బ్యాంకులో స్రవంతి పేరున రూ.6లక్షలు, భర్త పేరున రూ.55 లక్షల అప్పులు చూపించారు.

అలా చేస్తే.. మేము మునుగోడు ఉప ఎన్నిక బరిలో నుంచి తప్పుకుంటాం: మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాగా, మునుగోడు ఉప ఎన్నికకు సోమవారం 16 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చండూరులోని బంగారుగడ్డ నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లి, రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. మరో 14 మంది స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మునుగోడు బరిలో నిలిచే అభ్యర్థులు సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉంది. అయితే మునుగోడులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌ అభ్యర్థుల మధ్యే పోరు ఉంటుందనే టాక్ బాగా వినిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios