Asianet News TeluguAsianet News Telugu

తాను అబద్ధాలు చెబుతూ.. గవర్నర్‌తో కూడానా: కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణ ప్రజల్లో ఏ వర్గం కూడా కేసీఆర్ పాలన వల్ల సంతోషంగా లేరన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, ఆయన అనుచరులు తప్పించి ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు.

munugode congress mla komatireddy rajagopal reddy slams telangana cm kcr
Author
Hyderabad, First Published Mar 6, 2020, 5:24 PM IST

జరగని దానిని జరిగినట్లు కేసీఆర్‌కు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటని కోమటిరెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఆబద్ధాలు ఆడేది కాక గవర్నర్‌తో కూడా చెప్పిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల్లో ఏ వర్గం కూడా కేసీఆర్ పాలన వల్ల సంతోషంగా లేరన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, ఆయన అనుచరులు తప్పించి ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు.

Also Read:తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు చెక్:సీఎల్పీ ప్లాన్ ఇదీ

కేసీఆర్ ఓట్ల కోసమే పెన్షన్లు పెంచారని, ఎన్నికలు వచ్చినప్పుడే రైతు బంధు పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు. కోకాపేటలో భూములు ఉన్నోళ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వారికి, వందల ఎకరాలు ఉన్నోళ్లకు కూడా రైతు బంధు పథకం కింద డబ్బులు పడ్డాయన్నారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించిందా అని కోమటిరెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఒక్కరే ఉద్యమం చేసినందువల్ల తెలంగాణ రాలేదని.. ఉద్యమం చేస్తేనే కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడితే, బలిదానం చేసుకున్నవాళ్లు రోడ్లవెంట తిరుగుతున్నారని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇంటింటికి కుళాయి ఇవ్వనిదే తాను ఓట్లు అడగనని చంద్రశేఖర్ రావు అన్నారని, మునుగోడు నియోజకవర్గంలో తనతో పాటు పర్యటిస్తే ఎన్ని గ్రామాల్లో నల్లా వస్తుందో తెలుస్తందని కోమటిరెడ్డి చెప్పారు.

ఇంద్రకరణ్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి సైతం తమ నియోజకవర్గాల్లో ఇంటింటి నల్లా రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. ఇంటింటి నల్లాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Also Read:తండ్రీ కొడుకులిద్దరికి చెరో ఫాం హౌస్‌ కావాలా: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

ఆరేళ్లలో ఎన్ని లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. చింతమడక, ఎర్రవల్లి, సిరిసిల్ల, ఎర్రవల్లి, గజ్వేల్‌ తప్పించి ఇంకెక్కడ కట్టించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని కోమటిరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీరు అందిందో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios