భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలు, నాయకులు పలు అవతారాలు వేస్తూ ఉంటారు. 

ఉన్నట్లుండి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా అవతారమెత్తడంతో ఆర్టీసీలో ఎన్నికలు ఉన్నాయని అందుకే అలా బస్సు ఎక్కారనుకుంటే పొరబడినట్లే. సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించేందుకు ఎమ్మెల్యే గండ్రను డిపో సిబ్బంది ముఖ్యఅతిథిగా పిలిచారట. 

బస్సును ప్రారంభించడమే కాదు బస్సును డ్రైవ్ చేస్తానని చెప్పారు. భూపాలపల్లి బస్‌డిపో నుంచి బస్సును నేరుగా ఆర్టీ బస్టాండ్ వరకు నడిపి ప్లాట్ ఫాంపై ఉంచారు. ఎమ్మెల్యే కాస్త బస్సు నడపడంతో ప్రయాణికులు బస్సు వద్దుకు వచ్చి చూశారు.  ఎమ్మెల్యేతో డ్రైవింగ్ పై సరదాగా ముచ్చటించారు.