హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగిలింది. కేంద్రమాజీమంత్రి జైపాల్ రెడ్డి చనిపోయి 48 గంటలు గడవక ముందే మరో కీలక నేత చనిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న మాజీమంత్రి ముఖేష్ గౌడ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేష్ గౌడ్  2018  అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనారోగ్యం కారణంగో ఆయన ఎన్నికల ప్రచారం చేయలేకపోయారు. వీల్ చైర్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపొందారు. 

ఇకపోతే ముఖేష్ గౌడ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీమంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కు సమీప బంధువు. మేనమామ అవుతారు. అయితే 2018 ఎన్నికల్లో ముఖేష్ గౌడ్ తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. ముఖేష్ గౌడ్ ను తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ  దేవేందర్ గౌడ్ ఒత్తిడి పెంచారంటూ కూడా వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత