హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని అబ్దుల్లాపూర్ మెట్టు తాహిసిల్దార్ విజయా రెడ్డి అటెండర్ చంద్రయ్య మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. విజయారెడ్డిని కాపాడబోయి చంద్రయ్య గాయపడ్డారు. డిఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందతూ ఆయన మరణించారు.

దుండగుడు సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో విజయా రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. మంటల్లో చిక్కుకున్న విజయా రెడ్డిని కాపాడడానికి ప్రయత్నించిన క్రమంలో చంద్రయ్య గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూ వచ్చాడు.  

Also Read: tahsildar vijaya reddy: తహిసిల్దార్ విజయా రెడ్డి కారు డ్రైవర్ మృతి

విజయా రెడ్డి కారు డ్రైవర్ గుర్నాథం కూడా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. దాడి చేసిన సురేష్ కూడా తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.  గత నెలలో విజయా రెడ్డిపై కార్యాలయంలోనే దుండగుడు పెట్రోల్ పోసి తగులబెట్టాడు. 

మంటల్లో చిక్కుకున్న విజయా రెడ్డి గట్టిగా కేకలు వేయడంతో ఆమెను కాపాడేందుకు చంద్రయ్య, గుర్నాథం తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఆమెను కాపాడేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటన గత నెలలో జరిగింది.  విజయా రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిదే. 

Also Read: తహిసీల్దార్ విజయారెడ్డి హత్య.. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు