మా అన్నయ్య ఓ సూపర్ హీరో : ఎంపి కవిత

MP  Kavitha special Birthday wishes to his brother  KTR
Highlights

పురపాలక, ఐటీ మంత్రి కేటీఆర్ కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా ఇతర పార్టీల నేతలు, ప్రజలు ట్విట్టర్ ద్వారా భర్త్ డే విషెస్ చెబుతున్నారు. అయితే ఆయనతో పాటు తెలంగాణ రాజకీయాల్లో  క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కుటుంబ సభ్యులు ఓ ముగ్గురు కూడా ట్విట్టర్ లో విషెస్ తెలిపారు. వారు కేటీఆర్ కు శుభాకాంక్షలు ఎలా తెలిపారో చూద్దాం.

ముందుగా కేటీఆర్ సోదరి, నిజామాబాద్ ఎంపీ కవిత తన అన్నయ్యను సూపర్ హీరోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేసింది. సూపర్ హీరోలు లేరని అనుకునేవారికి నువ్వు ఉన్నావని చెబుతానంటూ అన్నయ్యపై ఉన్న ప్రేమను కవిత వ్యక్తపర్చింది. హ్యాపీ భర్త్ డే అన్నయ్యా అంటూ ట్వీట్ మొదలుపెట్టి, సూపర్ హీరోతో పోలుస్తూ ఎండ్ చేశారు.

 ఇక కేటీఆర్ మేనత్త కొడుకు హరీష్ రావు కూడా ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం నిరంతరం పాటుపడే నాయకుడు, కష్టించే స్వభావం గల వ్యక్తి కేటీఆర్ అంటూ హరీష్ కొనియాడారు.

ఇక ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన జోగినిపల్లి సంతోష్ కాస్త వెరైటీగా కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ తో కలిసి చిన్నపుడు దిగిన ఫోటోను పోస్ట్ చేసి హ్యాపీ భర్త్ డే బ్రదర్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.  

loader