భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ సిఎం కేసిఆర్ తిట్ల భాష టిఆర్ఎస్ పార్టీని ఇరుకాటంలో పడేసింది. కేసిఆర్ తీవ్రమైన మాటలు మాట్లాడడంతో కేసిఆర్ మాటలను సమర్థించలేక టిఆర్ఎస్ నేతలు ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న మంత్రి కేటిఆర్ తన తండ్రి నోరు జారిండని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద కామెంట్ చేశారు. లైట్ తీసుకోవాలంటూ రిక్వెస్టు చేశారు.

ఇక ఇవాళ రంగంలోకి ఎంపి కవిత దిగారు. ఆమె తన తండ్రి కేసిఆర్ ను వెనుకేసుకొచ్చారు. మాటల మధ్యలో మోడీ గారు అనే సందర్భంలో దొర్లిన మాట తప్ప సంచకుచిత స్వభావంతో ప్రధానిని అవమానించాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదన్నారు. అది రొటీన్ గా జరిగిన అంశమేనన్నారు. ఏమీలేని అంశాన్ని పట్టుకుని బిజెపి వాళ్లు ఇష్టమొచ్చిన తీరుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దావోస్ లో 600 కోట్ల ప్రజలు తనకు ఓట్లేశారని మోడీ కామెంట్ చేస్తే.. దాన్ని మేము ఏమైనా మోడీగారిపై విమర్శలు చేశామా? అని బిజెపి నేతలను ప్రశ్నించారు. ఎంపి కవిత ఇంకా ఏమన్నారో వీడియోలో చూడండి.