న్యూఢిల్లీ: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు రైతులకు జనవరిలో శుభవార్త వినిపిస్తామంటూ కీలక ప్రకటన చేశారు. పసుబోర్డును మించిన ప్రయోజనాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలను చూస్తే పుసుపుబోర్డు ఏర్పాటుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పసుపు రైతులు కోరుకుంటున్నట్లు అంతకు మించి అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో పసుబోర్డు అనేది కలగానే మిగిలిపోతుందంటూ చర్చ జరుగుతుతంది.

ఇలాంటి తరుణంలో శుక్రవారం పసుపు బోర్డుపై  కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. రైతులకు జనవరిలో శుభవార్త వినిపిస్తామని ప్రకటించారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపారు. 

అరవింద్‌ గట్టి నెగోషియేటర్‌ అన్న విషయం నిరూపిస్తాననని చెప్పుకొచ్చారు. పసుపు దిగుమతి నిలిపేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పుకొచ్చారు. తమ విన్నపం పట్ల కేంద్రం సైతం సానుకూలంగా స్పందించిందని చెప్పుకొచ్చారు. 

కవితకు ఊరట: అరవింద్ కు పసుపు రైతుల సెగ...

పసుపు జాతీయ స్థాయిలో సాగు చేసే పంటకాదని అయినప్పటికీ పసుపు పంటకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉందన్నారు. 

ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం పసుపు మద్దతు ధరపై ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్‌ కేటాయించాలని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకొచ్చారు. 

పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాము మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీదే అని ప్రధాని అన్నట్లు చెప్పుకొచ్చారు. 

తెలంగాణ గవర్నర్ ను కలిసిన ధర్మపురి అరవింద్...


రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడేది బీజేపీ సర్కారే అని కేంద్ర నాయకత్వం కూడా బలంగా నమ్ముతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అరవింద్. క్షేత్రస్థాయిలో సమాచారం లేకుండా మోదీ ఏదీ మాట్లాడరని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ రాష్ట్రప్రజలు బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే పసుపు రైతుల కష్టాలు, మద్దతు ధరపై ఎంపీ అరవింద్‌ శుక్రవారం కేంద్రమంత్రులు అమిత్‌ షా, పియూష్‌ గోయల్‌ను కలిశారు. విదేశాల నుంచి పసుపు దిగుమతి నిలిపివేయాలని రైతులను ఆదుకోవాలని మంత్రులను కోరారు ఎంపీ అరవింద్. 

ఇకపోతే ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ కు పసుపుబోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ తాజాగా మరో హామీ ఇచ్చారు. జనవరిలో శుభవార్త వింటారని అది పసుపుబోర్డుకు మించి ఉంటుందంటూ చెప్పుకొచ్చారు.

సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ అనంతరం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన పసుపుబోర్డు హామీని పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సైతం పసుపుబోర్డు  కలగా మిగిలిపోతుందా అన్న ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే. 

కల్వకుంట్ల కవిత ఓటమితో స్వంత పార్టీ నేతల విందు: కారణమిదే...