హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు సమస్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో చర్చించారు. నిజామాబాద్ నియోజకవర్గంలో తాను చేపడుతున్న పనులును వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తమకు సహకరించాలని కోరారు.

ఎంపీ ధర్మపురి అర్వింద్ తోపాటు ఆయన సతీమణి ప్రియాంక, వారి పిల్లలు సమన్యు, రుద్రాక్ష్ లు గవర్నర్ తమిలిసై సౌందరరాజన్  కలిశారు. కాసేపు రాజభవన్ ను తిలకించారు. అభినందనలు తెలిపిన అర్వింద్ కు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ధన్యవాదాలు తెలిపారు.