Asianet News TeluguAsianet News Telugu

డీఎస్ డిసైడెడ్: రాజీనామా చేస్తానని ప్రకటన

గత కొన్ని రోజులుగా తన రాజకీయ భవితవ్యం పై మౌనం వహిస్తున్న ఎంపీ డీఎస్ ఎట్టకేలకు పెదవి విప్పారు. తన మనసులో మాట బయటపెట్టారు. మున్నూరు కాపు సంఘం నేతలతో సమావేశమైన డీఎస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. 
 

mp d srinivas decided to join congress
Author
Hyderabad, First Published Sep 27, 2018, 4:32 PM IST

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తన రాజకీయ భవితవ్యం పై మౌనం వహిస్తున్న ఎంపీ డీఎస్ ఎట్టకేలకు పెదవి విప్పారు. తన మనసులో మాట బయటపెట్టారు. మున్నూరు కాపు సంఘం నేతలతో సమావేశమైన డీఎస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. 

అక్టోబర్ 11 తర్వాత తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఇమడలేకపోతున్నారని డీఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని సిగ్నల్స్ వచ్చినట్టేనన్నారు.  

గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న డీఎస్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న విబేధాల వల్ల డీఎస్ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. 

ఇకపోతే టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు డీఎస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే నెపంతో డీ.శ్రీనివాస్‌పై నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదుపై డి.శ్రీనివాస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తనను పార్టీ నుండి సస్పెండ్  చేయాలని కూడా డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ అధిష్టానంపై అసహానాన్ని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో తనకు సరైన గుర్తింపు లేదని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.  

మరోవైపు తన కుమారుడు సంజయ్ విషయంలో కేసీఆర్ సర్కార్ అత్యుత్సాహన్ని ప్రదర్శించిందని డీ.శ్రీనివాస్ ఆరోపించారు. తన చిన్న కొడుకు అరవింద్  బిజేపీలో చేరుతాడని ముందే కేసీఆర్ కు చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు.

శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే శాంకరీ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నమోదైన కేసులో  సంజయ్ ను అరెస్ట్ చేశారు. అయితే  ఈ  కేసు విషయమై  డీఎస్ కోర్టులో కూడ పిటిషన్ దాఖలు చేశారు. 

ఏపీ పోలీస్ మ్యాన్యువల్ ప్రకారంగానే  ఈ కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల తర్వాత ఆ పిటీషన్ ను డీఎస్ వాపసు తీసుకున్నారు. 

ఈ కేసులో జైలు నుండి సంజయ్  విడుదలైన తర్వాత డీఎస్ టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. సంజయ్ పై టీఆర్ఎస్ సర్కార్ అతిగా వ్యవహరించిందని అభిప్రాయపడ్డారు.

మరో వైపు తన చిన్న కొడుకు అరవింద్ బీజేపీలో చేరుతారని ముందే కేసీఆర్ కు చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. అరవింద్ కు చిన్నప్పటి నుండి బీజేపీ, మోడీ అంటే ఇష్టమని ఆయన గుర్తు చేశారు.

తన ఇద్దరు కొడుకులు స్వతంత్రంగా ఎదిగారని చెప్పారు. రాజకీయంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే అధికారం వారికి ఉంటుందన్నారు. వారి నిర్ణయాల్లో తన జోక్యం ఉండదన్నారు. 

సంజయ్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు తన కుటుంబాన్ని బజారుపాలు చేసిందని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఎలాంటి తప్పు చేయకున్నా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీఎస్ మండిపడ్డారు. తన కొడుకు వెంట తన అనుచరులను బీజేపీలో చేరాలని ఏనాడూ తాను చెప్పలేదని డీఎస్ స్పష్టం చేశారు.  

ఆ తర్వాత రాజకీయాల్లో స్తబ్ధుగా ఉన్న డీఎస్ కాంగ్రెస్ లో చేరేందుకు పావులు కదుపుతున్నారు. అటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం డీఎస్ ఇంటికి వెళ్లి గంటపాటు మంతనాలు జరిపారు. ఆ తర్వాత డీఎస్ అనుచరుడు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా డీఎస్ సైతం అక్టోబర్ 11 తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోబోతున్నారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios