Asianet News TeluguAsianet News Telugu

దారుణం... ఆడబిడ్డను గోదావరి నదిలో విసిరేసిన కన్నతల్లి (వీడియో)

గోదావరి నదిలోకి కన్నబిడ్డను విసిరేసి ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

Mother killed two months baby at Godavarikhani AKP
Author
First Published May 24, 2023, 1:56 PM IST

పెద్దపల్లి : నవమాసాలు కడుపున మోసి ప్రాణం పోసిన కన్నతల్లే ఈ పసిగుడ్డు ప్రాణం తీసింది. రెండు నెలల కూతురును గోదావరి నదిలోకి విసిరేసి ఆ తర్వాత తల్లి కూడా దూకేందుకు యత్నించింది. ఇలా కన్నబిడ్డతో కలిసి ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

 వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా రామగిరి మండలకేంద్రంలోని సెంటినరీ కాలనీకి చెందిన భూక్యా ప్రియాంక ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఆ తల్లి దారుణంగా ప్రవర్తించింది. రెండు నెలల కూతురుని తీసుకుని ప్రియాంక గోదావరిఖని పట్టణ శివారులోని గోదావరి నది వద్దకు వెళ్ళింది. బ్రిడ్జి పైనుండి ఒళ్లోని బిడ్డను నదిలోకి విసిరేసిన తల్లి ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. కానీ ఆమెను గమనించిన ఓ ఆటో డ్రైవర్ కాపాడి రివర్ గార్డ్ పోలీసులకు అప్పగించారు. ఆమెను గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. 

వీడియో

Read More  సంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి.. !

ఇక ప్రియాంక బిడ్డ కోసం గజ ఈతగాళ్లతో గోదావరి నదిలో గాలింపు చేపట్టారు పోలీసులు. చాలాసేపు గాలింపు తర్వాత చిన్నారి మృతదేహం లభించగా అప్పటికే అక్కడికి చేరుకున్న తండ్రికి అప్పగించారు. కొడుకు మృతదేహాన్ని ఎత్తుకుని ఆ తండ్రి రోదిస్తున్న తీరు చూసేవారికి కన్నీరు తెప్పిస్తోంది. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios