తన ప్రేమను కాదన్నదని ఓ యువకుడు డిగ్రీ విద్యార్థినిపై బ్లేడుతో దాడిచేసి హత్యాయత్నం చేశాడు. ఆ విద్యార్థిని స్వల్ప గాయాలతో బయటపడింది. 

సంగారెడ్డి : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమోన్మాది డిగ్రీ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. స్థానిక తార ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది ప్రవీణ్ సదరు డిగ్రీ విద్యార్థిని మీద బ్లేడుతో దాడి చేసి.. హత్యకు ప్రయత్నించాడు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే, ఈ ఘటనలో విద్యార్థిని అఖిల ప్రియ స్వల్ప గాయాలతో బయటపడింది. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతోనే ప్రవీణ్.. అఖిల ప్రియమీద దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. దాడిలో స్వల్ప గాయాలతో బయటపడిన అఖిల ప్రియ ప్రస్తుతం కాలేజీలోనే పరీక్షలు రాస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది.