కిడ్నాపర్లనే నెపంతోదాడి: కర్ణాటకలో హైద్రాబాద్ టెక్కీ మృతి

Mob lynches Hyderabad techie on child-lifting suspicion in Karnataka
Highlights


బీదర్:కర్ణాటక రాష్ట్రంలోని బీదర్  లో  పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో  నలుగురిపై స్థానికులు పాశవికంగా దాడి చేయడంతో ఆజం అనే టెక్కీ అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారంతా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 


బీదర్:కర్ణాటక రాష్ట్రంలోని బీదర్  లో  పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో  నలుగురిపై స్థానికులు పాశవికంగా దాడి చేయడంతో ఆజం అనే టెక్కీ అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారంతా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 మహమ్మద్ ఆజం, ఇస్మాయిల్,  సల్మాన్,  మహమ్మద్ బషీర్లు స్నేహితులు.  బషీర్ కర్ణాటక రాష్ట్రంలోని  ఔరంగబాద్ తాలుకాలోని  హందకేరీ గ్రామస్థుడు. బషీర్ హైద్రాబాద్‌లో పనిచేసేవాడు. 

బషీర్ కోరిక మేరకు మిగిలిన ముగ్గరు స్నేహితులు హైద్రాబాద్ నుండి  ఔరంగాబాద్ తాలుకాలోని హందకేరీ ప్రాంతానికి కారులో బయలుదేరారు. అయితే మార్గమద్యలో రిఫ్రెష్‌మెంట్ కోసం బాల్కూట్ తండా వద్ద వీరు తమ కారును నిలిపివేశారు. అదే సమయంలో కొందరు స్కూల్ విద్యార్ధులు వారికి కన్పించారు.

అయితే తమ వద్ద ఉన్న స్వీట్స్, తినుబండారాలను విద్యార్ధులకు ఈ నలుగురిలో ఒక్కరు ఇచ్చారు. అయితే  వీరిని పిల్లలను కిడ్నాప్ చేసే వ్యక్తులుగా భావించిన స్థానికులు వారిపై దాడికి దిగారు.

అయితే స్థానికులు గుంపులుగా గుంపులుగా వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే వారు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే రోడ్డుపై రాళ్లు అడ్డుపెట్టి వారిని పారిపోకుండా అడ్డుకొన్నారు. కారు నుండి బయటకు లాగి తీవ్రంగా దాడి చేశారు.

తాము కిడ్నాపర్లం కాదని చెప్పినా వినలేదు. విపరీతంగా దాడి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పించే ప్రయత్నం చేసినా  ఆగ్రహంతో ఉన్న ప్రజలను కంట్రోల్ చేయలేకపోయారు.

అయితే ఎట్టకేలకు పోలీసులు వారిని దాడి చేస్తున్న ప్రజల నుండి రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే గ్రామస్థుల దాడిలో ఆజం అనే టెక్కీ మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆజంకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అతడికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు.  ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని  ఆజం కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం  ఆజం డెడ్‌బాడీ బీదర్ నుండి హైద్రాబాద్‌కు తరలించారు.

ఈ ఘటనకు పాల్పడిన 32 మంది గ్రామస్థులను పోలీసులుఅరెస్ట్ చేశారు. ఇంకా పారిపోయిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.తప్పుడు సమాచారాన్ని వాట్సాప్ ద్వారా చేరవేసిన  గ్రూప్ ఆడ్మిన్ ‌ను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.

loader