MLC Kavitha : ఐటీ రంగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉందని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్‌లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha : ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత, సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయంగా, అధికార కార్యక్రమాలతో బిజీ బిజీ అవుతున్నారు. శనివారం నాడు ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్‌లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐటీ రంగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉందని అన్నారు. హైదరాబాద్ నగరం నలువైపులా ఐటి పరిశ్రమలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు.
Also Read: up assembly elections 2022: విద్యార్థులకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్‌లు !
దీనిలో భాగంగానే ఉప్పల్ కారిడార్ లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కేటీఆర్ గారు యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారనీ, హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కాగా, సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ ప్రారంభ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: telangana : ఈ నెల 13 నుంచి మట్టి గణపతుల విగ్రహాల తయారీలో శిక్షణ
ఇదిలావుండగా ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా కదులుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అలాగే, అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న వారిపై తనదైన శైలీలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం భీమ్ గల్ లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొంత మంది నాయకులు రాజకీయం చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. వారి మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ నేతల మాటలు అస్సలు నమ్మవద్దని అన్నారు. బీజేపీ నాయకులు రాజకీయాల కోసం బట్టేబాజ్ మాటాలు మాట్లాడుతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Lebanon Explosion: లెబనాన్లో భారీ పేలుడు..27 మంది మృతి
