Asianet News TeluguAsianet News Telugu

telangana : ఈ నెల 13 నుంచి మట్టి గణపతుల విగ్రహాల తయారీలో శిక్షణ

telangana : తెలంగణ ప్రభుత్వం చేతివృత్తుల‌ను ప్రొత్స‌హిస్తూ ఇప్ప‌టికే ప‌లు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ది.  ఇదే నేప‌థ్యంలో ప్ర‌కృతికి హాని చేయ‌ని మ‌ట్టి గ‌ణ‌ప‌తుల త‌యారీకి సంబంధించి మ‌రో కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టుంది. బీసీ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో కుమ్మ‌రివారికి మ‌ట్టి గ‌ణ‌ప‌తుల త‌యారీకి సంబంధించి ఈ నెల 13 నుంచి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నుంది. 
 

TS Government training in making clay Ganeshas
Author
Hyderabad, First Published Dec 11, 2021, 3:42 PM IST

Telangana :చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ  తెలంగాణ ప్రభుత్వం ఎన్నో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కుమ్మరి వారికి మట్టి గణపతులు చేయడంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 13 నుంచి హన్మకొండలో 200 మందికి మట్టి గణపతుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ  కార్పొరేషన్ ఎండీ కె.‌ అలోక్ కుమార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బీసీ  సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశంల ప్రోత్సాహంతో గతంలోనూ మట్టి గణేషులు తయారీలో 50 మంది కుమ్మరి వారికి శిక్షణ ఇచ్చిన విష‌యాన్ని గుర్తిచేశారు. ప్ర‌కృతికి హాని చేయ‌నీ, ఎకో ఫ్రెండ్లీ  మట్టి గణపతి విగ్రహాలు  తయారు చేసి ఆర్థికంగా లబ్ధి పొందారని ఆయన అన్నారు.

Also Read: Lebanon Explosion: లెబనాన్‎లో భారీ పేలుడు..27 మంది మృతి


దీనికి కొన‌సాగింపుగానే మ‌ళ్లీ కుమ్మ‌రి వారికి మ‌ట్టి గ‌ణ‌ప‌తుల త‌యారీ శిక్ష‌ణ కార్య‌క్రమాన్ని చేప‌డుతున్న‌ట్టు తెలిపారు. ఈ నెల 13 న ప్రారంభించనున్న ఈ వ‌ర్క్ షాప్‌లో  రెండు వందల మందికి శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. దీనిని దశలవారీగా కొన‌సాగించ‌నున్న‌ట్టు తెలిపారు.  ప్రతి బ్యాచ్ లో ఇరవై మందికి శిక్షణ ఇస్తామనీ, మొత్తం పది బ్యాచ్ లుగా శిక్షణ ఉంటుంద‌ని  అన్నారు.  ఈ శిక్షణ ద్వారా ఐదు అడుగులు, అంతకు మించి  ఎత్తులో మట్టి గణపతి విగ్రహాలు తయారు చేయడంలో వారు నైపుణ్యం సాధించి సులభంగా విగ్రహాలను తయారు చేస్తారని అన్నారు. 

Also Read: ఎన్నికలు ఏవైనా గెలుపు తెరాసదే : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఇదిలావుండ‌గా, గణేష్ చతుర్థిని పర్యావరణ హితంగా జరుపుకునేందుకు ప్రజలు చూస్తున్న నేపథ్యంలో గత కొన్నేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. ప్రజలకు మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా, పర్యావరణహితంగా పండుగను జరుపుకునేందుకు ప‌లు  చోట్ల ప్ర‌భుత్వ యంత్రాంగంతో పాటు ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మ‌ట్టి వినాయ‌కును పంపిణీ చేస్తున్నాయి. ఈ ఏడాది వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా హైద‌రాబాద్  మున్సిపల్ అధికారులు మట్టి గణేష్ విగ్రహాలను ఉచితంగా సరఫరా  చేసిన సంగ‌తి తెలిసిందే.  ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం సైతం ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ మ‌ట్టి వినాయ‌కుల విగ్ర‌హ త‌యారీ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ద‌ని అధికారులు పేర్కొంటున్నారు. 

Also Read: Covid-19 impact: స్కూళ్ల మూత.. 32 కోట్ల మంది చిన్నారుల‌పై ప్ర‌భావం !

Follow Us:
Download App:
  • android
  • ios