Asianet News TeluguAsianet News Telugu

Kavitha’s arrest: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు.. !

Kavitha’s arrest: ఈడీ దాడులకు ముందే అరెస్టుకు ప్లాన్ చేసిందనీ, సోమవారం వ‌ర‌కు అప్పీలు కోసం కోర్టులను ఆశ్రయించలేమనీ, అందుకే శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత‌ను అరెస్టు చేశార‌ని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. రాజకీయ కక్షగా ఆరోపించారు. 

MLC Kalvakuntla Kavitha's arrest: BRS protests against ED, Centre and state governments across Telangana: BRS T Harish Rao RMA
Author
First Published Mar 16, 2024, 7:05 AM IST

Kalvakuntla Kavitha arrest:  తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) త‌న‌య ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. శుక్ర‌వారం బీఆర్ఎస్ నాయ‌కులు, ఈడీకి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం మ‌ధ్య క‌విత‌ను అరెస్టు చేసిన తీరును బీఆర్ఎస్ శ్రేణులు ఖండిస్తున్నాయి. ఈడీ తీరుతో పాటు అధికార పార్టీకి వ్య‌తిరేకంగా శ‌నివారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) తన కార్యకర్తలకు పిలుపునిచ్చింది. కేంద్ర ఏజెన్సీ న‌డుచుకున్న తీరు అప్రజాస్వామ్య, అనైతిక ఎత్తుగడగా అభివ‌ర్ణించింది.

తెలంగాణలో అధికార కాంగ్రెస్ స‌ర్కారు, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం కుమ్మక్కయ్యాయనీ, ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కార‌మే ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను నిరుత్వానిరుత్సాహపరిచేందుకు ప్లాన్ చేశారని పార్టీ సీనియర్ నేత త‌న్నీరు హరీశ్ రావు ఆరోపించారు. ఈడీ దాడులకు ముందే అరెస్టుకు ప్లాన్ చేసిందని ఆరోపించిన హ‌రీశ్.. సోమవారంలోపు అప్పీలు కోసం కోర్టులను ఆశ్రయించలేమనీ, అందుకే శుక్రవారం క‌వితను అరెస్టు చేసే కుట్ర‌కు తేర‌లేపార‌ని అన్నారు.

General Elections 2024: బిగ్ బ్రేకింగ్.. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న..

అలాగే, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయంగా బీఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకు బీజేపీ ఇలా చేసిందని ఆరోపించారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామ‌నీ, దీనిపై గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ. కిషన్‌రెడ్డితో సహా బీజేపీ నేతలు పలు వ్యాఖ్యలు చేయ‌డాన్ని గుర్తు చేశారు. ఈ చర్యపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామ‌ని హ‌రీశ్ రావు పేర్కొ్నారు. కేంద్ర ఏజెన్సీ క‌విత‌ను తరలించిన తీరుపై పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు నొక్కిచెప్పారు.

“కేసు ఈరోజు సుప్రీంకోర్టులో బెంచ్‌కి చేరుకుంది.ఇప్పటికి కేవలం మూడు రోజుల వ్యవధిలో మార్చి 19కి వాయిదా పడింది. సుప్రీంకోర్టులో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఈడీ హామీ ఇచ్చింది. ఇప్పుడు, దాని స్వంత మాటలకు విరుద్ధంగా, ఏజెన్సీ ఒక మహిళను అరెస్టు చేసింది, అది కూడా శుక్రవారం సాయంత్రం 6 30 గంటల తర్వాత, ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జ‌రిగింది" అని హ‌రీశ్ అన్నారు. కాగా, ఈడీ ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్‌లోని క‌విత నివాసంలో దాడులు చేసి,  ఆమెను సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు.

బీఆర్ఎస్ కు ఊపిరి పోసేందుకే కవిత అరెస్ట్ - కాంగ్రెస్

Follow Us:
Download App:
  • android
  • ios