General Elections 2024: బిగ్ బ్రేకింగ్.. రేపే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన..
General Elections 2024: సార్వత్రిక ఎన్నికలు 2024, పలు రాస్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే లోక్ సభ, పలు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను శనివారం ప్రకటించనుంది.
General Elections 2024 -ECI : సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘ సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే లోక్ సభ, పలు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను శనివారం ప్రకటించనుంది. తాజాగా ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామనీ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్, సంబంధిత వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై జాతీయ సర్వేను పూర్తి చేసిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 2024 సార్వత్రిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారం జమ్ముకశ్మీర్ పర్యటనతో ఈసీఐ తన సర్వేను ముగించింది. 543 లోక్ సభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటివరకు 267 మంది అభ్యర్థులతో రెండు జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ రెండు జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఇదిలావుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తమకు అందిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీఐ మార్చి 14న బహిర్గతం చేయడంతో పాటు సుప్రీంకోర్టుకు అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల పత్రాలను సీల్డ్ కవర్/సీల్డ్ బాక్సుల్లో తిరిగి ఇవ్వాలని కోరింది.
కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం లేదు.. 75% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు.. జల్ జీవన్ మిషన్