కాంగ్రెస్ గూటికి రాములు నాయక్:రేపు రాహుల్ సమక్షంలో పార్టీ తీర్థం

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. శనివారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ అసమ్మతి నేత రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఢిల్లీలో మకాం వేశారు. శనివారం ఉదయం 10 గంటలకు రాహుల్ తో భేటీ కానున్నారు.

mlac ramulu naik will joins congress tomorrow

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ లోకి వలసలు జోరందుకున్నాయి. శనివారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ అసమ్మతి నేత రాజ్యసభ సభ్యుడు డీఎస్ ఢిల్లీలో మకాం వేశారు. శనివారం ఉదయం 10 గంటలకు రాహుల్ తో భేటీ కానున్నారు. అనంతరం పార్టీ కండువా కప్పుకోనున్నారు.  

ఆయన బాటలోనే టీఆర్ఎస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ సైతం పయనిస్తున్నట్లు సమాచారం. శనివారం రాహుల్ గాంధీని కలసి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవల గోల్కొండ హోటల్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రాములు నాయక్ కలిశారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో టీఆర్ ఎస్ పార్టీ అతనిని సస్పెండ్ చేసింది. 

దీంతో భవిష్యత్ కార్యాచరణ కోసం గిరిజన మేధావులతో రాములు నాయక్ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌లో చేరాలంటూ రాములు నాయక్‌ను అనుచరులు ఒత్తిడి చేశారు. దీంతో రాములు నాయక్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే శనివారం ఉదయం ఢిల్లీ బయలు దేరి రాహుల్ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. 

రాములు నాయక్ నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ లో నారాయణ ఖేడ్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నారాయణ ఖేడ్ టిక్కెట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. 

తొందరలోనే ప్రజాకూటమి తొలిజాబితా విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆశావాహులు తమ టిక్కెట్ల కోసం పార్టీలోకి జంప్ చేస్తున్నారు. అటు రాములు నాయక్ తోపాటు ఇటీవలే టీఆర్ఎస్ తో విబేధించిన నర్సారెడ్డి, బీసీ నేత ఎల్ బీనగర్ మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సైతం కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

నాలాగే టీఆర్ఎస్‌లో చాలా మంది: ఏడ్చిన రాములు నాయక్

రాములు నాయక్‌ ‌పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు

టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ రాములు నాయక్

కేటీఆర్ బచ్చా కాదు అచ్చా మంత్రి.....ఎమ్మెల్సీ రాములు నాయక్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios