ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టొద్దు: కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఫైర్
ఉద్యోగుల, టీచర్ల బదిలీల విషయంలో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేటలో ఇవాళ రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ఉద్యోగుల, టీచర్లకు కునుకు లేకుండా చేసిందని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే Etela Rajender చెప్పారు.
మంగళవారం నాడు ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. 124 జీవో రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్థానికత ఆధారంగా 3 సంవత్సరాల్లో బదిలీలు చేయాలనే పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కానీ 3 సంవత్సరాలు kcr ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమితమై ఉద్యోగ, Teachers సంఘాలతో చర్చలు జరపకుండానిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. చిక్కుముడులు, అపోహలు,అనుమానాలు అన్నీ నివృత్తి జరిగేలా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాలన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలయ్యే వరకుTransfer ప్రక్రియ నిలుపుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
అన్నీ తనకే అన్నీ తెలుసననే రీతిలో CM కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. 3 సంవత్సరాలు కుంభ కర్ణుడిలా పడుకొని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు.ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తున్నారని ఆయన అడిగారు.
ఉద్యోగుల సీనియారిటీలో పారదర్శకత లేదన్నారు. సీనియారిటీలో శాస్త్రీయత లేదని కూడా ఆయన విమర్శలు చేశారు. ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే బాగా పని చేయగలరని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ గుర్తు చేశారు.భార్య భర్త ఒక దగ్గర ఉంటేనే బాగుంటుందని కేసీఆర్ చేపిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.ఈ విషయాలను సీఎం అయ్యాక కేసీఆర్ మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. కిడ్నీ, హార్ట్, న్యూరో పేషెంట్లకు,మెంటలీ డిజార్డర్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధనలో భాగమైన ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టొద్దని ఆయన కోరారు.