‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ ఇకలేరు..
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రచయిత శ్రీరమణ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
హైదరాబాద్ : మిథునం రచయిత, ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత శ్రీరమణ ఇకలేరు. పేరడీ రచనలో సుప్రసిద్ధులు ఆయన. శ్రీరమణ బాపు, రమణలతో కలిసి పనిచేశారు. 70యేళ్ల వయసున్న శ్రీరమణ గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలను కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రసిద్ధి ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత, సుప్రసిద్ధమై, సినిమాగా కూడా మలచబడిన మిథునం కథా రచయిత,
పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా, పలు విధాలుగా సాహిత్య, కళా రంగాల్లో ప్రసిద్ధి వహించిన శ్రీరమణ తుదిశ్వాస విడిచారు.
శ్రీరమణ పత్రికల్లో వ్యంగ్య హాస్య భరితమైన కాలమ్స్ నడిపిన కాలమిస్టుగా, కథకుడిగా, సినిమా నిర్మాణంలో నిర్వహణ పరంగా పలు విధాలుగా సాహిత్య, కళారంగాల్లో ప్రసిద్ధి వహించారు. ఆయన "పత్రిక" అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన హాస్యరచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.
శ్రీరమణ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, వేమూరు మండలం, వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21 న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అనసూయ, సుబ్బారావులు. వారి తండ్రి పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. శ్రీరమణ అసలు పేర్లు వంకమామిడి రాథాకృష్ణ, కామరాజు రామారావు.
వారి తాతగారికి ఆడపిల్లలే గాని మగ పిల్లలు లేరు. పి.యు.సిలో వుండగా ఆయనను దత్తత చేసుకున్నారు. వారి జన్మనామం "వంకమామిడి రాథాకృష్ణ". దత్తతకు వెళ్ళిన తరువాత నామం "కామరాజు రామారావు"గా మార్చారు. రెండు పేర్లే కాకుండా రెండు వేర్వేరు ఇంటిపేర్లతో కన్ ఫ్యూజ్ ఉండేది. ఈ తికమక నుంచి బయటపడాలని ఆయన తన పేరును "శ్రీరమణ"గా
మార్చుకున్నారు.