Asianet News TeluguAsianet News Telugu

వరసకు అన్నాచెల్లెళ్లు, స్కూలుకు వెడుతూ దగ్గరయ్యారు.. గర్భం దాల్చడంతో, భయపడి..

వరుసకు అన్నాచెల్లెళ్లయ్యే ఇద్దరు మైనర్లు సాన్నిహిత్యంతో ఒక్కటయ్యారు. కొద్దిరోజులకు బాలిక గర్భం దాల్చింది. దీంతో పెద్దలకు భయపడి పారిపోయారు. 

minors found in secunderabad railway station fled from bihar  over love affair
Author
First Published Sep 29, 2022, 6:47 AM IST

సికింద్రాబాద్ : వారిద్దరూ వరుసకు అన్నా చెల్లెలు. వారి ఇద్దరి వయసూ 15 ఏళ్లే.  పాఠశాలకు వెళ్లి వస్తుండగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బాలిక గర్భం దాల్చింది. ఆ తరువాత కానీ వారికి తామేం చేశారో బుర్రకు ఎక్కలేదు. దీంతో భయపడి, పారిపోయి నగరానికి వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దివ్యదశ చైల్డ్ లైన్ కంట పడ్డారు. వివరాల్లోకి వెడితే.. పక్కపక్క ఇళ్లలో ఉండే  బాలిక(15), బాలుడు(15) కలిసి చదువుకుంటున్నారు. 

ఆ చనువుతో దగ్గరయ్యారు. వరసకు అన్నా చెల్లెలు కావడంతో కుటుంబ సభ్యులు అనుమానించలేదు. బాలికకు రెండు నెలలుగా రుతుక్రమం ఆగిపోవడంతో బాలుడికి చెప్పింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఏడునెలల గర్భవతి అని తేల్చారు. ఈ విషయం తెలిస్తే ఊర్లో గొడవ జరుగుతుందని ఆందోళనకు గురయ్యారు. ఈ నెల 22 రైల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వీరిద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో దివ్యదశ చైల్డ్ లైన్ ప్రతినిధులు వీరిని గుర్తించి ఆరా తీశారు.  

జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ .. ఇంటింటికీ నీళ్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా అవార్డ్

దీంతో అసలు విషయం బయటపడింది. వారిద్దరి నుంచి సేకరించిన వివరాలతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మొదట బాలుడి కుటుంబ సభ్యులు రావడంతో అతడిని వారికి అప్పగించారు. ఆ తర్వాత వచ్చిన బాలిక కుటుంబ సభ్యులు దీని మీద జీఆర్పీలో ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. కేసును బీహార్ కు బదిలీ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
 
ఇదిలా ఉండగా, నిరుడు జూలైలో ఇలాంటి ఘటనే వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయి, వావి వరసలు మరిచి దారుణాలకు తెగబడుతున్నారు. చెల్లి వరసయ్యే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణ ఘటనే వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారుల ఫిర్యాదు మేరకు వనపర్తి రూరల్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 

చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు, పోలీసుల కథనం మేరకు.. బాలసదనంలో ఉండే ఓ బాలికను ఇటీవల జమ్ములమ్మ పండుగ కోసం గార్డియన్ అభ్యర్థన, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు బయటకు పంపించారు. అలా ఇంటికి వచ్చిన అమ్మాయి.. ఘటన జరిగిన రోజు ఇంటి ఆవరణలో ఉండగా వరుసకు అన్నయ్య అయ్యే వెంకటేష్ అనే యువకుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. ఆ తరువాత లైంగిక దాడికి పాల్పడ్డాడు. గార్డియన్ ఇచ్చిన సమాచారంతో చైల్డ్ ప్రొటెక్షన్ విభాగం అధికారులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నట్టు రూరల్ ఎస్ఐ షఫీ తెలిపారు. బాలికకు తల్లీ తండ్రి ఇద్దరూ లేరు. 

Follow Us:
Download App:
  • android
  • ios