హైదరాబాద్ మాదాపూర్ లో  మైనర్ బాలికను  డ్రైవర్ గా పనిచేసిన కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్  చేశాడు.  ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు  చేసింది. 

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లోని ప్రైవేట్ స్కూల్ లో  ఐదో తరగతి చదువుతున్న  విద్యార్ధినిని   డ్రైవర్ కిడ్నాప్ చేశారు.   మైనర్ విద్యార్ధినికి మాయమాటలు చెప్పి  గతంలో ఇదే స్కూల్ లో డ్రైవర్ గా  పనిచేసిన   కుమార్ అనే డ్రైవర్ కిడ్నాప్  చేశాడు.  ఈ ఘటనకు సంబంధించి   బాలిక పేరేంట్స్  పోలీసులకు ఫిర్యాదు  చేశారు. బాలికను కుమార్   కిడ్నాప్  చేసిన దృశ్యాలు   సీసీటీవీ కెమెరాల్లో  రికార్డయ్యాయి. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు.  బాలికను తీసుకొని నిందితుడు  కర్ణాటక వైపు వెళ్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.