తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టడానికి ఏఫి ఇంటలిజెన్స్ అధికారులు ప్రయత్నించి ఇటీవల పట్టుబడిన  విషయం తెలిసిందే. ఏపికి చెందిన ముగ్గురు అధికారులు అనుమానాస్పదంగా ఓ నియోజకవర్గంలో తిరుగుతుండటంతో టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారని మంత్రి కేటీఆర్ ఇటీవల వెల్లడించారు. వారు కేవలం ఎన్నికల పరిస్థితుల గురించి తెలుసుకోడానికి వస్తే పరవాలేదు కానీ డబ్బులు పంచడానికి వచ్చారని ఆయన ఆరోపించారు. మహా కూటమి తరపున చంద్రబాబు ఆదేశాలతోనే ఇంటలిజెన్స్ అధికారులు వారిని పంపింనట్లు కేటీఆర్ తెలిపారు.

అయితే ఇదే అంశంపై మంత్రి తలసాని కాస్త ఘాటుగా స్పందించారు. నియోజకవర్గాల్లో ఇలా అనుమానాస్పదంగా తిరుగుతూ ఏపి  ఇంటలిజెన్స్ అధికారులు కనిపిస్తే వారిని పట్టుకుని మొదట తన్నాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు సూచించారు. ఆ తర్వాత మిగతా విషయాలను మేం చూసుకుంటామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో ఇవాళ యాదవుల సమ్మెళనంలో పాల్గొన్న తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.  

మరిన్ని వార్తలు

ఏపి ఇంటలిజెన్స్ తో తెలంగాణలో చంద్రబాబు కుట్రలు...సాక్ష్యాలివే...: కేటీఆర్

అలా అడిగితే ఇలా చెప్పా: చంద్రబాబుపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ మీద కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు