Asianet News TeluguAsianet News Telugu

పిట్టల దొర పొంగులేటీ... నన్ను ఓడించడం నీ తరంకాదు: మంత్రి పువ్వాడ

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

Minister Puvvada Ajay counter to Ponguleti Srinivas Reddy AKP
Author
First Published May 22, 2023, 4:06 PM IST

ఖమ్మం : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రాజకీయాల్లో బచ్చాగాడని... పిట్టలదొరలా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.తనపై బచ్చాగాన్ని నిలబెట్టి మరీ గెలిపించుకుంటానని పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు పువ్వాడ కౌంటర్ ఇచ్చారు.ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి బచ్చా... తనను ఓడించడం ఆయన తరం కాదని అన్నారు. అభివృద్ది, సంక్షేమమే తిరిగి తనను గెలిపిస్తుందిని పువ్వాడ ధీమా వ్యక్తం చేసారు. 

బిఆర్ఎస్ నుండి సస్పెండయిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరనున్నారని... త్వరలో ఇదే జరగబోతోందని మంత్రి పువ్వాడ తెలిపారు. ఆ పార్టీలో చేరిన తర్వాత పొంగులేటికి కేసీఆర్ విలువ తెలుస్తుందన్నారు. ప్రస్ట్రేషన్ లో వున్న పొంగులేటి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని... పిట్టల దొరలా రోజుకో వేషం వేస్తున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వారి మాటలకు పువ్వాడ భయపడే రకం కాదని అన్నారు. 

తనపై బచ్చాగాడిని కాదు ఎవరినైనా నిలబెట్టుకో... తన గెలుపును మాత్రం అడ్డుకోలేవని పొంగులేటికి పువ్వాడ సవాల్ విసిరారు. తాను చేసిన అభివృద్దిని ఖమ్మం ప్రజలు చూస్తున్నారని... వాళ్లే గెలిపించుకుంటారని అన్నారు. ఖమ్మం రాజకీయ చరిత్రలో పువ్వాడకు గొప్ప స్థానం వుంది... ఆ పువ్వాడ బిడ్డే ఈ పువ్వాడ అని గుర్తుంచుకోవాలని అన్నారు. 

Read More  జీవో 111 ఎత్తివేత వెనుక పెద్ద భూ కుంభకోణం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై కన్నేసాడని... అయినా ఆయన సీఎం ఏమిటి? అంటూ పువ్వాడ ఎద్దేవా చేసారు. దోచుకున్న ప్రజాధనం వందల కోట్లు వున్నంతమాత్రాన ముఖ్యమంత్రి కాలేరన్నారు. కాంట్రాక్టర్ గా పొంగులేటి వివిధ పనుల్లో ఎంతెంత దోచుకున్నది వివరాలతో సహా వున్నాయని... ఆ కేసులు ఎక్కడికీ పోలేవన్నారు. పొంగులేటి చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు వస్తున్నారు.. . దమ్ముంటే రేపు రా బిడ్డా అని సవాల్ విసిరారు.  పొంగులేటి దగ్గరున్న డబ్బు తెలంగాణ ప్రజల ఎడమకాలి చెప్పుతో సమానమని మంత్రి పువ్వాడ అన్నారు. 

ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ పార్టీలో వుంటూనే అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచింది ఇదే పొంగులేటి అని పువ్వాడ ఆరోపించారు. ఆయన చేతిలో మోసపోయిన ఎమ్మెల్యేలు చాలామందే వున్నారన్నారు. ఎంపీగా పొంగులేటి ఖమ్మంకు ఏం చేసారో చెప్పాలని మంత్రి పువ్వాడ ఛాలెంజ్ చేసారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios