Asianet News TeluguAsianet News Telugu

జీవో 111 ఎత్తివేత వెనుక పెద్ద భూ కుంభకోణం: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

జీవో  111  ఎత్తివేతతో  రైతులకు  ఉపయోగం లేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  ఆరోపించారు.  

CLP Leader  Mallu Bhatti Vikramarka   Responds  On  lift  on G.O 111  lns
Author
First Published May 22, 2023, 4:00 PM IST

మహబూబ్ నగర్:  జీవో  111  ఎత్తివేత వెనుక  పెద్ద భూకుంభకోణం  ఉందని  సీఎల్పీ  నేత మల్లుభట్టి విక్రమార్క  ఆరోపించారు. ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లాలో  సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క  పాదయాత్ర  కొనసాగుతుంది.  సోమవారంనాడు మహబూబ్ నగర్ జి్లాలో  మల్లు భట్టి విక్రమార్క  మీడియాతో మాట్లాడారు. రియల్టర్ల కోసమే  111  జీవోను  రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని  ఆయన  ఆరోపించారు.  జీవో  111 ఎత్తివేత తో  రైతులకు  ఒరిగేదేమీ లేదన్నారు. 

 జీవో  111  నెంబర్  పరిధిలోని గ్రామాల్లో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు   పెద్ద ఎత్తున భూములున్నాయన్నారు.   111 జీవో  పరిధిలో  సుమారు  5 వేల ఎకరాలు  బీఆర్ఎస్ నేతలకు  ఉన్నాయని ఆయన ఆరోపించారు.  

ఇంకా కూడా  ఈ గ్రామాల్లో బీఆర్ఎస్  నేతలు  భూములు  కొనుగోలు  చేస్తున్నారని  భట్టి విక్రమార్క  విమర్శించారు.  111 జీవో  పరిధిలో  ఎవరెవరికి  ఎన్ని  ఎకరాల భూములున్నాయో  బయటపెట్టాలని  ఆయన  డిమాండ్  చేశారు.  ప్రభుత్వం  ఈ భూముల వివరాలు  బయట పెట్టకపోతే రానున్న రోజుల్లో  తమ పార్టీ ఆధ్వర్యంలో   ఈ భూముల వివరాలను బయట పెడతామని  భట్టి విక్రమార్క  ప్రకటించారు. 

111 జీవో  ఎత్తివేత వల్ల  రైతులు లేదా జంట నగరాలకు సమీపంలోని  పర్యావరణకు ఉపయోగపడాలన్నారు. కానీ  ఈ జీవో ఎత్తివేత  కారణంగా  బీఆర్ఎస్ నేతలకు  ప్రయోజనం కలుగుతుందన్నారు. జీవో  111   ఎత్తివేతతో  ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్  లు  కూడా  మిగిలిపోయే  పరిస్థితి కూడ లేదని  ఆయన  ఆరోపించారు.ఈ నెల 19వ తేదీన  తెలంగాణ కేబినెట్ సమావేశం  హైద్రాబాద్ లో  జరిగింది.  ఈ సమావేశంలో  111  జీవోను ఎత్తివేస్తూ  కేబినెట్  నిర్ణయం తీసుకుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios