అయూబ్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన పట్నం పార్టీ తరుపున 10 లక్షలు తన వ్యక్తిగతంగా 20 లక్షలు కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు
గత నెల 30 న ఆత్మహత్య యత్నానికి పాల్పడిన టీఆర్ఎస్ నేత ఆయూబ్ ఖాన్ శుక్రవారం తెల్లవారు జాము మృతి చెందారు. సమాచారం తెలిసిన రవాణా మంత్రి మహేందర్ రెడ్డి తెల్లవారు జాము 1.40 కి హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లోని డీఆర్ డీఓ అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామార్శించారు. అనంతరం మంత్రి ఉదయం 10.30 కు ఉస్మానియా ఆస్పత్రిలో ఆయూబ్ ఖాన్ కు శవ పరిక్షలు చేయించారు. డిప్యూటీ సీఎం మహామూద్ ఆలీ, ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, టీఎస్ ఎంఐడీసి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి మరోసారి పరామార్శించారు. అనంతరం మంత్రి కాన్వాయ్ తో అయూబ్ ఖాన్ భౌతిక కాయాన్ని స్వగ్రామం తాండూరు లోని ఇంటి కి పర్యాద కృష్ణ మూర్తి తో కలసి చేర్చారు. అంనంతరం తాండూరు ముస్లిం నాయకులతో కలిసి ఆయూబ్ ఖాన్ కుటుంబానికి పార్టీ పరంగా 10 లక్షలు, వ్యక్తిగతంగా మరో 20 లక్షల ఆర్టిక సహాయం ప్రకటించారు. ఆయూబ్ ఖాన్ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇప్పిస్తామని ప్రకటించారు.
అంనంతరం డిప్యూటీ సీఎం మహామూద్ ఆలీ, ఎంఎల్ఏలు సంజీవరావు, యాదయ్య,ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి, టీఎస్ ఎంఐడీసి చైర్మన్ పర్యాద కృష్ణ మూర్తి, టీఆర్ఎస్
పోలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్ రెడ్డి, నాయకులు బైండ్ల విజయ్ కుమార్,శుభప్రద్ పటేల్, రహూఫ్,కరుణం పురుషోత్తం రావు, నారాయణ రెడ్డి, విజయలక్ష్మి,శోభారాణి, అనురాధ, శకుంతల, అమిత్, జడ్పీటీసీ రవిగౌడ్,ఎంపిపిలు తదితరులతో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్న రు. ఆయూబ్ ఖాన్ మృతి దురదృష్టకరం, బాధాకరం అన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలు,ఉద్యమంలో పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.
రేపటి జన్మదిన వేడుకలకు మంత్రి దూరం.
తాండూరు లో టీఆర్ఎస్ పార్టీ నేత ఆయూబ్ ఖాన్ గత నెల 30 న ఆత్మహత్య యత్నం కు పాల్పడి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జాము మృతి చెందారు. ఈ నేపథ్యంలో 23 న మంత్రి మహేందర్ రెడ్డి జన్మదినం ఉన్నా వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు పట్నం. జన్మదిన వేడుకలు జరపరాదని పార్టీ కార్యకర్తలు,వర్గాలు లకు సూచించారు. ప్లెస్కీలు కూడా వేయరాదని మంత్రి ఆదేశించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
