Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్-తెలుగు క్రైమ్ న్యూస్

విశేష వార్తలు

  • కర్నూల్ లో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
  • హుస్సెన్ సాగర్ వద్ద సైన్యం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
  • నేరేడ్మెట్ లో బ్యాంక్ అఫ్ ఇండియా ఖాతాదారుల ఆందోళన
  • నల్గొండ జిల్లాలో ఆమ్ ఆద్మీ నేతపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
  • తాండూర్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీఆర్ఎస్ నేత ఆయూబ్ ఖాన్ మృతి
asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

అమెరికా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపి

అమెరికా లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసగించిన వ్యక్తులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే పెనమలూరు కు చెందిన కోటయ్య అనే వ్యక్తి 65 మంది నిరుద్యోగులకు అమెరికాలో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి కోటి రూపాయలు వసూలు చేశాడు. అలాగే వారి నుంచి పాస్ పోర్టులను తీసుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. 
డబ్బులు చెల్లించి ఏడాది గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో మోసపోయిన భాదితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కోటయ్యను అతడికి సహకరించిన సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 

మహా బతుకమ్మ సంబరాల ఏర్పాట్లపై సమీక్ష (వీడియో)

నాంపల్లి లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ నెల 24 నిర్వహించే మహా బతుకమ్మ పండుగ సంబరాల ఏర్పాట్లను టూరిజం,సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పర్యవేక్షించారు.  సంభందిత శాఖల అధికారులను వెంటపెట్టుకుని స్టేడియానికి వెళ్లిన ఆయన నిర్వహణ పై క్షేత్ర స్థాయి ఏర్పాట్లను సమీక్షించి, వారికి తగు సలహాలు సూచనలు చేశారు.                      

కర్నూలు లో నకిలీ కరెన్సీ ముఠా సభ్యుడి ఆత్మహత్యాయత్నం 

కర్నూలు జిల్లాలో పట్టుబడిన నకిలీ నోట్ల ముఠా సభ్యుడొకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బండిఆత్మకూరులో సంభవించింది. వివరాల్లోకి వెళితే ఇవాళ కర్నూల్ పోలీసులు నకిలీ నోట్లను చలామణి చేస్తున్న  ముగ్గురితో కూడిన ముఠాని అరెస్ట్ చేశారు.  వారి వద్ద నుండి 11 వేల నకిలీ నగదు తో పాటు ప్రింటర్ లు, స్కానర్ లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ ముఠాకు తనకు సంభందం లేదంటూ సుధాకర్ అనే నిందితుడు బ్లేడ్ తో చేయి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతన్ని నిలువరించిన పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   

హుస్సేన్ సాగర్ లో ప్రళయ సాహసం

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రజలను సురక్షితంగా కాపాడటానికి సైన్యం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. ఏంటి అసలు హైదరాబాద్ లో వర్షలే లేవు హుస్సెన్ సాగర్ కు వరదలేంటి అనుకుంటున్నారా. ఇదంతా హుస్సేన్ సాగర్ వద్ద సైన్యం, ఎస్డీఆర్ఎఫ్ ఆద్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్. ప్రళయ సాహసం పేరుతో హుస్సేన్ సాగర్ లో ప్రత్యేక సెట్టింగ్ వేసి నిర్వహించిన ఈ డ్రిల్ వీక్షకులను ఆకట్టుకుంది. 

తులసిదళం సీరియల్ నిషేధించండి

ఓ టీవి చానల్ ప్రసారం కానున్న తులసి దళం సీరియల్ ను నిషేధించాలని బాలల హక్కుల సంఘం  నారాయణ గుడా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. చానల్ యాజమాన్యం,డైరెక్టర్ ,నిర్మాత లపై  క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
 భయంకరమైన చేతబడుల లాంటి క్షుద్ర పూజలను ప్రోత్సహిస్తూ పిల్లల లో భయాలను, అప నమ్మకాలను కలిగించేలా వున్న ఈ తులసి దళం సీరియల్ పై  బ్లాక్ మ్యాజిక్ ప్రివెన్షన్ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలని కోరింది.
పిల్లల కు జ్ఞానం ఇచ్చే న్యూస్ చానెల్స్ చూపించాలి గాని ఇలాంటి పనికిరాని చానళ్లను ప్రోత్సహించరాదని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు.
 

నేరేడ్మెట్ లో బ్యాంక్ అఫ్ ఇండియా ఖాతాదారుల ఆందోళన (వీడియో)

మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ లోని బ్యాంక్ అఫ్ ఇండియా ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఖాతా దారుల ఎకౌంటు లోంచి బ్యాంక్ ఉద్యోగి సుధాకర్ రెడ్డి  కోటి రూపాలయల వరకు డబ్బును దోచుకుని   పరారయిన విషయం తెలిసిందే. నిందితుడు సుధాకర్ బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంట్ గా  విధులు నిర్వర్తిస్తున్నాడు.ఈ విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంక్ వద్దకు చేరుకుని అందోళన చేపట్టారు. ఎవరెవరి ఖాతాలో ఎంతెంత నగదు మాయమైందోనని వారు ఆందోళన చెందుతున్నారు.  
ఇటీవల విజయవాడలో ఖాతాదారుల తాకట్టు బంగారాన్ని చోరీ చేసిన బ్యాంకు ఉద్యోగి భాగోతం మరువక ముందే ఈ సంఘటన వెలుగుచూడటంతో భ్యాంకులపై ఖాతాదారులు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.                     

ఆమ్ ఆద్మీ నాయకుడిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

నల్గొండ శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి ఫై హత్యాయత్నం జరిగింది. అతడు వ్యవసాయ పొలం వద్ద పనుల్లో ఉండగా అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తల విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిని గుర్తించిన కుటుంబసభ్యులు పురుషోత్తంను హాస్పిటల్ కు తరలించారు. 
 
 

తాండూర్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన టీఆర్ఎస్ నేత ఆయూబ్ ఖాన్ మృతి

asianet telugu  crime news  Andhra Pradesh and Telangana

 

గత నెల ఆగస్టు 30 న మంత్రి మహేందర్ రెడ్డి ఎదురుగానే పార్టీ మీటింగ్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెలంగాణ ఉద్యమకారుడు, టిఆర్ఎస్ తాండూర్ పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ మృతి చెందారు.
ఉద్యమకారుల కు టిఆర్ఎస్ పార్టీ లో గుర్తింపు ఇవ్వటం లేదని ఆయన మంత్రి సమక్షంలోనే తాండూరులో నిప్పు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి డీఆర్డీఏ ఆపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న అయ్యూబ్ ఖాన్  ఇవాళ మరణించాడు.
దీంతో తాండూరులో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. పట్టణంలోని మంత్రి మహేందర్ రెడ్డి ఇంటివద్ద కూడా పోలీసులను భారీగా మొహరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios