Asianet News TeluguAsianet News Telugu

ధాన్యం కొనుగోళ్ల రగడ.. పంజాబ్‌ మాదిరిగా తెలంగాణలోనూ కొనండి: కేంద్రానికి నిరంజన్ రెడ్డి డిమాండ్

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోనే డబ్బు చెల్లిస్తే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోందని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 

minister niranjan reddy fires on central govt over paddy issue
Author
Hyderabad, First Published Nov 9, 2021, 9:55 PM IST

ఎఫ్‌సీఐ (fci) వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి గడ్కరీ (nitin gadkari) చెప్పినట్లు తెలంగాణ వ్యవసాయశాఖ (telangana agriculture minister) మంత్రి నిరంజన్‌రెడ్డి (niranjan reddy) తెలిపారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  3 లక్షల కోట్ల టన్నుల బియ్యం వృథాగా ఉన్నాయని గడ్కరీ చెప్పారని వెల్లడించారు. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని కోరారని.. ధాన్యం కొనలేమని కేంద్రం లేఖల ద్వారా రాష్ట్రానికి చెప్పిందని మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పాలని నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 

ఇన్నాళ్లూ కేంద్రం బాయిల్డ్‌ రైసు తీసుకోలేదా? అని ఆయన ప్రశ్నించారు. ధాన్యం సేకరణలో (paddy) కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమేనని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల్లోనే డబ్బు చెల్లిస్తే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోందని వ్యవసాయ మంత్రి మండిపడ్డారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  

Also Read:తెలంగాణ కోటా మేరకు ఎరువులు సరఫరా చేయాలి: కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ

అనంతరం మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar) మాట్లాడుతూ.. తెలంగాణ వడ్లు కొనాలని కేటీఆర్‌తో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను (piyush goyal) కలిసినట్లు ఆయన గుర్తుచేశారు. పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని.. రాజ్యాంగం ప్రకారం అది కేంద్రం బాధ్యత అని గంగుల అన్నారు. దానికి అప్పుడు పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారని.. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయని, కొననే కొనం అని కమలాకర్ చెప్పారు. 

తమది కొత్త రాష్ట్రం .. ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడే ఈ విషయం మీద స్పందించాలని, కేంద్రాన్ని ఒప్పించాలని కిషన్ రెడ్డి (kishan reddy) , బండి సంజయ్‌లను (bandi sanjay) కోరితే నోరు తెరవలేదని.. కానీ ఈ రోజు రైతులను రెచ్చగొడుతున్నారని గంగుల కమలాకర్ మండిపడ్డారు. కేంద్రం కొనడం లేదు .. కొనే అవకాశం, నిల్వ చేసే అవకాశం రాష్ట్రానికి ఇవ్వడం లేదని మంత్రి మండిపడ్డారు. బీజేపీ నేతలు వడ్ల కొనుగోళ్లపై కేంద్రమంత్రులను నిలదీయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios