తెలంగాణ కోటా మేరకు ఎరువులు సరఫరా చేయాలి: కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయకు లేఖ రాశారు.
హైదరాబాద్: రాష్ట్ర అవసరాలకు సరిపడు ఎరువులను సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి mansukh mandaviyaకు మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల Fertilizer కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
Telangana రాష్ట్ర అవసరాల మేరకు నెలవారీగా కావాల్సిన ఎరువుల కోసం సెప్టెంబరు మాసంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు మాసాలకు గాను 6.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకు గాను కేవలం 3.67 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కేటాయించింది.కేటాయించిన కోటాలో కూడా ఇప్పటి వరకు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే కేంద్రం సరఫరా చేసింది.
కేంద్ర కేటాయింపుల ప్రకారమే 2.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఇంకా రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఇతర దేశాల నుండి వచ్చిన వెసెల్స్ నుండి ఎరువులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.గంగవరం పోర్టులోని ఐపీఎల్ కంపెనీ వెసెల్ నుండి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.కాకినాడ, విశాఖ పోర్టులలో ఉన్న ఆర్ సీ ఎఫ్, ఛంబల్, ఐపీఎల్ ఫర్టిలైజర్స్ కు చెందిన వెసెల్స్ నుండి 30 వేల మెట్రిక్ టన్నుల డీఏపీని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
క్రిబ్ కో కంపెనీ నుండి రెండు అదనపు రేక్ లు యూరియా కేటాయించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు.అక్టోబర్, నవంబర్ నెలలలో తక్కువగా సరఫరా చేసిన ఎరువులను డిసెంబర్ నుండి మార్చి సరఫరాలో భర్తీ చేయాలని Niranjan Reddyకేంద్రాన్ని కోరారు.
also read:'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ సర్కార్ కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఈ విషయమై ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది టీఆర్ఎస్. పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేుయాలని టీఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై కేంద్రం తన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై గ్రామాలకు వచ్చే బీజేపీ నేతలను, కేంద్ర మంత్రులను నిలదీయాలని టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
పెట్రోల్, డీజీల్ లపై సెస్ ను కూడా తగ్గించాలని కూడా టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కేసీఆర్ విమర్శించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
కేంద్రం తీరును ఎండగట్టేందుకు తాను ప్రతి రోజూ మీడియా సమావేశాలను నిర్వహిస్తానని కేసీఆర్ ప్రకటించారు. వరుసగా రెండు రోజుల పాటు ఆయన మీడియా సమావేశాలు నిర్వహించారు.