రాజకీయ కారణాలతోనే ఫార్మాసిటీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. దీనిని అడ్డుకుంటున్న వాళ్లు ఓసారి ఆలోచించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

మన దగ్గర తయారైన వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు పంపిస్తున్నామని.. అత్యాధునిక టెక్నాలజీతో పూర్తి కాలుష్య రహితంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.

Also Read:రేపో మాపో కేసీఆర్ ప్రకటన... నిరుద్యోగ యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త

ఫార్మాసిటీతో మీ పిల్లలకు ఇబ్బందైతే నాది హామీ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రైతులకు కూడా నష్టపరిహారం, భూమలు ఇస్తున్నామని.. మూడు దశాబ్ధాల కిందట కాలుష్యం రాకుండా సాంకేతిక లేదని కానీ ఇప్పుడు పరిస్ధితి పూర్తిగా మారిపోయిందని కేటీఆర్ వెల్లడించారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అజమాయిషీ ఎక్కువైందని మంత్రి చెప్పారు. ఫార్మా సిటీలో పనిచేసేవారు కూడా అక్కడే నివసిస్తారని, ఆ గాలినే పిలుస్తారని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం మీద ద్వేషంతో తెలంగాణ బిడ్డలకు లక్షలాది కొలువులు తీసుకొచ్చే ఫార్మా సిటీని అడ్డుకుంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.