Asianet News TeluguAsianet News Telugu

రేపో మాపో కేసీఆర్ ప్రకటన... నిరుద్యోగ యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త

తెలంగాణలో 50 వేల ఉద్యోగాలు భర్తీ అతి త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.   

minister KTR announcement on Unemployment Allowance
Author
Hyderabad, First Published Jan 28, 2021, 4:22 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చదువుకుని ఉద్యోగాల రాకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దీరోజుల్లో అర్హులైన యువతీ యువకులకు నిరుద్యోగ భృతి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు రేపో మాపో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అలాగే 50 వేల ఉద్యోగాలు భర్తీ అతి త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.  

టీఆర్ఎస్ భవన్ లో గురువారం నాడు జరిగిన  తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నుండి పలువురు నేతలు తెలంగాణ  విద్యుత్ కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా  నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.  

''తెలంగాణలో ప్రస్తుతం కరెంట్ సమస్య లేదు. భవిష్యత్తులో ఇక కరెంట్ పోదు అని కచ్చితంగా చెప్పగలను. అన్ని రంగాలకు కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేది. సిరిసిల్లలో గతంలో కరెంట్ కావాలని ఏఈని అడిగే వాళ్ళం. పవర్ హాలిడే వారానికి మూడు రోజులు ఉండేది. ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసాం. కానీ అవన్నీ అధిగమించి కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఆ కష్టం అంత మీదే..'' అన్నారు.

read more విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం: కేటీఆర్

''7వేల మెగావాట్ల నుండి16 వేళా మెగావాట్ల ఉత్పత్తి కి ఎదిగాం. సోలార్ విద్యుత్ లో రెండో స్థానంలో ఉన్నాం. 28 రాష్ట్రాల్లో ఎప్పుడు ముందున్న రాష్ట్రాల కంటే తలసరి విద్యుత్ లో తెలంగాణ ముందుంది.పరిశ్రమలకు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. కొత్త విద్యుత్ కేంద్రాలు, కొత్త లైన్లు అన్ని తీసుకొచ్చిది తెలంగాణా మాత్రమే. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోయేవి, కానీ ఇప్పుడు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం'' అని పేర్కొన్నారు. 

''విద్యుత్ కార్మికుల సమస్యలు అన్ని పరిష్కరిస్తాం. ఇది మీ మా ప్రభుత్వం. ప్రత్యేక చొరవ తీసుకుంటాం. మౌలిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతున్నాయి. అందులో మీ కృషి కూడా ఉంది. వాయువేగంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసాం. సాగు తాగు నీరు ఇస్తున్నాం. ధాన్యబాండగారం తెలంగాణ నిలిచింది. ఈ ఆరున్నర ఏళ్లలో అన్ని పూర్తి చేశారు కేసీఆర్. 945 గురుకుల పాఠశాలలు,విదేశాలలో చదువుకునే విద్యార్థులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నాం'' అని వెల్లడించారు.

''నిన్న ఇవాళ కొంత మంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒకరు టీపీసీసీ అయితే మరొకరు టీ బీజేపీ. అయితే ఈ టీ(తెలంగాణ) అనే పదం కేసీఆర్ పెట్టిన భిక్ష. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది సీఎం కేసీఆర్. కాబట్టి రాష్ట్ర సాధనకు మీరు ఏ విధంగా ఉద్యమం చేశారో అలాగే వీరిని కూడా తిప్పికొట్టాలి'' అని కేటీఆర్ సూచించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios