హరీష్ కు కోపమొచ్చింది.. మైక్ పారేశి పోయిండు (వీడియో)

First Published 11, Mar 2018, 6:23 PM IST
minister harish rao serious on mla muttireddy yadagirireddy
Highlights
  • దేవాదుల ఫేజ్ 3 ప్రారంభ సభలో షాకింగ్
  • మైక్ కింద పారేశి వెళ్లిపోయిన మంత్రి హరీష్
  • హరీష్ మాట్లాడకుండా డిస్టర్బ్ చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
  • అసహనంతో వెళ్లిపోయిన హరీష్

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. జనగామ జిల్లాలోని నర్మెట మండలం, బొమ్మకూరు గ్రామంలో జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్ 3 పంప్ హౌస్ ను మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. పంప్ హౌస్ నుంచి కన్నెబోయినగూడెం, లద్నూరు, తపాస్ పల్లి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేశారు. అనంతరం బొమ్మకూరులో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో హరీష్ రావు మాట్లాడుతున్నారు.

మంత్రి మాట్లాడుతుండగా ఎమ్మెల్యే పదే పదే పక్కనున్న వాళ్లతో, టీడర్లతో, కార్యకర్తలతో మాట్లాడుతూ హరీష్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. మధ్యలో సైలెంట్ గా ఉండాలంటూ ముత్తిరెడ్డికి సూచించారు హరీష్. కానీ ముత్తిరెడ్డి వినిపించుకోకుండా పక్కనున్న వాళ్లతో మాట్లాడుతున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హరీష్ రావు మీటింగ్ లో మాట్లాడకుండా మైక్ పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే మంత్రి వెళ్లకుండా ఎమ్మెల్యే ఆపే ప్రయత్నం చేసినా హరీష్ వినిపించుకోలేదు. సభా వేదిక నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు.

హరీష్ మైక్ కింద పారేసి వెళ్లిపోయిన వీడియో కింద చూడండి.

loader