Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాలు బీఆర్ఎస్‌వే : మంత్రి హరీశ్ రావు

వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. ఈడీలు, సీబీఐలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తమకు కార్యకర్తల బలం వుందన్నారు.ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ.. ఈ రోజు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు పేర్కొన్నారు. 

minister harish rao comments on upcoming telangana elections
Author
First Published Mar 27, 2023, 7:49 PM IST

వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈడీలు, సీబీఐలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తమకు కార్యకర్తల బలం వుందన్నారు. బీఆర్ఎస్ అంటే బీదలు, రైతులు, సామాన్యుల పార్టీ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణకు పొరుగునే వున్న.. కర్ణాటక, మహారాష్ట్రల్లో ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ లేదని హరీశ్ రావు అన్నారు. బీజేపీకి అదాని దోస్త్ అన్న ఆయన రైతులు మాత్రం ఆ పార్టీకి దోస్త్‌లు కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మంత్రి జోస్యం చెప్పారు. 

కేంద్రం నిర్ణయాలన్నీ అదానీ ఆస్తులు పెంచేవేనని హరీశ్ రావు ఆరోపించారు. నెత్తి, కత్తి లేని వాళ్లు నత్తి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్, నూతన సెక్రటేరియట్‌లను కూలుస్తామన్న పార్టీలు మనకొద్దని హరీశ్ పిలుపునిచ్చారు. హిందూ, ముస్లింలను రెచ్చగొట్టి కర్ణాటకలో మరోసారి గెలవాలని బీజేపీ చూస్తోందని మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో పాటు ఎకరాకి పది వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ.. ఈ రోజు తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని హరీశ్ రావు పేర్కొన్నారు. స్థలం వున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్ధిక సహాయం అందిస్తామని మంత్రి తెలిపారు. 

Also REad: అర్వింద్‌ది ఫేక్ డిగ్రీ.. సంజయ్, రేవంత్‌లు ఒక్కసారైనా పరీక్ష రాశారా : పేపర్ లీక్ ఆరోపణలపై కేటీఆర్ కౌంటర్

అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీ 15 లక్షలు ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయారని కేటీఆర్ చురకలంటించారు. పార్టీ కార్యకర్తలు లేకుండా తాము లేమని.. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని మంత్రి పేర్కొన్నారు. డైలాగులు కొట్టుడు సులభం, కానీ పనిచేయడమే కష్టమన్నారు. ఫేక్‌డు గాళ్లు, జోకుడు గాళ్లు ఏదేదో చెబుతారని.. తెలంగాణ గ్రామాలు అభివృద్ధిలో పోటీపడుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా తెలంగాణ పథకాలు లేవని.. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. 

విద్యార్ధులు ఎవరి మీద కొట్లాడాలని మంత్రి ప్రశ్నించారు. కరీంనగర్‌కు ఏం చేశావో చెప్పు అని బండి సంజయ్‌ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎంను పట్టుకుని బండి సంజయ్ బ్రోకర్ అంటున్నాడని.. ప్రధాని మోడీ బ్రోకర్ అని తాను అనలేనా అని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ తనకు సంస్కారం వుందని, తాను అననని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు వచ్చిన బీఎల్ సంతోష్ బ్రోకర్ కాదా అని మంత్రి ప్రశ్నించారు. తాను పేపర్ లీక్ చేసి అమ్ముకుని బతుకుతున్నానట అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవితంలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎప్పుడైనా ఒక్క పరీక్ష రాశారా అని ఆయన ప్రశ్నించారు. 

ఎంపీ అరవింద్‌ది  ఫేక్ డిగ్రీ అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణను శత్రు దేశంగా చూస్తున్నారని.. తెలంగాణ పుట్టుకను అవమానించింది ప్రధాని కాదా అని ఆయన నిలదీశారు. గుజరాత్ గులాంల చెప్పుల మోసే బండి సంజయ్ తెలంగాణలో పుట్టడం దురదృష్టకరమన్నారు. ప్రధాని మోడీ తన దోస్తులకు దోచి పెడుతున్నారని.. అదానీ ఇచ్చే చందాల కోసం మోడీ దిగజారుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ఒక్కటే బతికుండాలె, అన్ని పార్టీలను చంపేయాలన్నదే మోడీ ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు. పోతారంలో గ్రూప్ 1 పాస్ అయ్యింది ముగ్గురేనని మంత్రి తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios