Asianet News TeluguAsianet News Telugu

Harishrao: ఇది సబబేనా?... గవర్నర్ పై మంత్రి హరీష్ ఆగ్రహం

 Harishrao:గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఏడు నెలలుగా ఆపారని, సుప్రీంకోర్టులో కేసు వేస్తే మూడు బిల్లులు పాస్ చేశారన్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతిని ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలు గమనించాలని అన్నారు.

minister harish rao angry with governor tamilsai hyderabad telangana krj
Author
First Published Apr 10, 2023, 3:19 PM IST

Harishrao: గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.. దీంతో  రాష్ట్ర ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి.  తాజాగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్  మూడు  బిల్లులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయ బిల్లులకు ఆమెదం తెలిపారు. ఇదే సమయంలో ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లులను  రాష్ట్రపతి పరిశీలన కోసం పంపినట్టు తెలుస్తోంది. 

ఈ విషయంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతి పత్తి కలిగిన సంస్థలను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టడం దారుణమని అన్నారు.  అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ 7 నెలలుగా ఆపారనీ, దీని వెనుక రాజకీయం ఏంటి అనేది అందరికి తెలుసునని అన్నారు. కోర్టులో కేసులు వేస్తే .. కానీ బిల్లులకు ఆమోదం లభించలేదని అసహనం వ్యక్తం చేశారు. 

 ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ బిల్లును అడ్డుకుని, రాష్ట్రపతి పరిశీలనకు పంపారనీ,  కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఉద్యోగాలు ఇస్తామంటే, 7 నెలలు ఆపి ఆ బిల్లును కూడా నేడు రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా ? అని ప్రశ్నించారు. తమ పిల్లలకు చదువులు చెప్పే ప్రొఫెసర్లు వద్దా అన్నారు. 1961 నుంచే బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అన్ని వర్సిటీలకు కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఉందన్నారు. గవర్నర్ తీరు సబబేనా?.. ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తే.. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం గవర్నర్ చర్యలను  అసహ్యించుకుంటుందన్నారు.  సుప్రీం కోర్టులో కేసు వేస్తే .. నేడు  రెండు ముడు బిల్లులు పాస్ చేశారనీ, బీజేపీ రాష్ట్రంలో  కుట్రలు చేస్తోందనీ, రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటుందని మంత్రి మండిపడ్డారు. 

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే.. గిన్నీ నోటిఫికేషన్ల అంటారనీ, పేపర్లు లీక్ చేసి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేశారని ఆవేదన చెందారు. తెలంగాణ బిడ్డల భవిష్యత్ కంటే తమకు రాజకీయాలు ముఖ్యమన్నంటూ బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా .. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టానని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios