2012లో నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో వివాదాస్పద వ్యాఖ్యల కేసుకు సంబంధించి ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం నిర్మల్ కోర్టుకు హాజరయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో డిసెంబర్ 22, 2012లో ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన సభలో హిందూ దేవుళ్లు, దేవతల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి

Also read:నిన్నొదలా: నాంపల్లి కోర్టు ఆదేశం, అక్బరుద్దీన్ ఓవైసీపై క్రిమినల్ కేసు

 ‘‘తమను పోలీసులు అడ్డుకోకుండా కేవలం 15 నిమిషాల సమయమిస్తే బిలియన్ హిందువులకు తమ పవర్ ఏంటో చూపిస్తామంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏడేళ్లుగా అక్బరుద్దీన్ విచారణను ఎదుర్కొంటున్నారు. 

తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు అక్బరుద్దీన్. గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాను ఎన్నికల ప్రచారంలో హాట్ కామెంట్లు చేశారు.

Also Read:అక్బరుద్దీన్ ఓవైసీకి ఐపీఎస్ అధికారి క్లీన్ చిట్

రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నా ... తమ ముందు తలవంచాల్సిందేనంటూ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. చాంద్రాయణగుట్ట నుంచి 1999, 2004, 2009, 2014, 2018లలో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.