ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామభక్తి భావజాలాలు ఉన్నవాడు భారతీయుడు కాదని, అంబేద్కర్, గాంధీ భావజాలాలు ఉన్నవాడే భారతీయుడని ఒవైసీ వ్యాఖ్యానించారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశామని.. అంతేకాకుండా ఈ చట్టాలపై సుప్రీంకోర్టులోనూ పోరాడుతున్నామని ఒవైసీ స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ చట్టాలను దేశవ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.

తాము జైల్ భరో నిర్వహిస్తే, దేశంలో జైళ్లు సరిపోవని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఉద్యమం ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేమని.. ఇప్పటికే ఈ వ్యతిరేకత మొదలై 50 రోజులు దాటిందన్నారు. 

Also Read:

ఆ విషయంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌దీ ఒకే బాట, కానీ.... తెలంగాణలో ఇలా..

కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్ లైక్ వీడియోలు

మా అమ్మను కాపాడండి కోరిన టెక్కీ: కేటీఆర్ స్పందన ఇదీ