హైదరాబాద్: తన తల్లిని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కోరారు. ఆమె ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు.ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.

 

బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారన్ జిల్లా రక్షాహుల్ జిల్లాలో అపహరణకు గురైన తన తల్లిని కాపాడాలని హైద్రాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గరిమ అనే యువతి తెలంగాణ రాష్ట మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ మేరకు ఆ యువతి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ను అభ్యర్థించారు. ఈ ట్వీట్ కు కేటీఆర్ వెంటనే స్పందించారు.

యువతి ట్వీట్ ను తెలంగాణ డీజీపీకు పంపారు. బీహార్ డీజీపీని సంప్రదించి గరిమ తల్లి ఆచూకీ కనుగోవాలని తెలంగాణ డీజీపీని మంత్రి ఆదేశించారు. తెలంగాణ డీజీపీ వెంటనే బీహార్ డీజీపికి ఈ సమాచారం పంపారు. 

తెలంగాణ డీజీపీ బీహార్ డీజీపీకి సమాచారం చేరవేసిన తర్వాత కేటీఆర్ ఆ యువతికి ట్వీట్ చేశారు. మీ తల్లి సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తోందని నమ్ముతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.