కరీంనగర్: కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్  కార్యాలయంలోనే లైక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లైక్  వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రతి రోజూ కమిషనర్ ను కలిసేందుకు వందలాది మంది వస్తుంటారు. అయితే అలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయకుండా ఈ రకంగా లైక్ వీడియోలతో కాలక్షేపం చేయడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఉన్నతాధికారులు, కార్పొరేషన్‌ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ క్షణం తీరిక లేకుండా ఉండాల్సిన ఆయన ఏకంగా కార్యాలయంలోనే లైక్‌లో రొమాంటిక్‌ వీడియోలు, డైలాగులు చెబుతున్న వీడియోలు బయటకు వచ్చాయి.

 ప్రజలు, కార్పొరేటర్లు నిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. వారికి సమాచారం ఇస్తూ ఉండాల్సిన కమిషనర్‌  సీసీ ఇలా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రాకేశ్‌ కార్యాలయంలోని తన సీట్లో కూర్చొని సుమారు 8 వీడియోలు చేశారని అంటున్నారు.ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గతంలో ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో కూడ ఇదే తరహాలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వారిని విధుల్లో నుండి తొలగించారు..హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు పేషేంట్లను వదిలి టిక్ టాక్ వీడియోలు చేయడంతో వారిని తొలగించారు.

కరీంనగర్ లోని డీహెంఅండ్ హెచ్ ఓ కార్యాలయంలో గతంలో ఇద్దరు ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు చేయడంతో వారిపై సస్పెన్షన్ వేలు వేశారు. కరీంనగర్ కమిషనర్ సీసీ రాకేష్ పై అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకొంారనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.