హైదరాబాద్: తెలంగాణలో అధికార పక్షమైన టిఆర్ ఎస్, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వ వైఖరిని  కాంగ్రెస్ తప్పుపడుతోంది. గత ఆరేళ్ళుగా దాదాపు రాష్ట్రంలో ఇదే పరిస్థితి నెలకొంది.

Also read:ఢిల్లీకి ఎక్స్ అఫిషియో పంచాయతీ...కేకే పై బీజేపీ ఫిర్యాదు

అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఎత్తిచూపడం ఆ కార్యక్రమాల్లో జరుగుతున్న లోటుపాట్లను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఎండగట్టడం పై ప్రతి పక్ష పార్టీగా కాంగ్రెస్ ఆ పని చేస్తుంది.

 కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఒకటయ్యాయి. ఇరు పార్టీలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను  టిఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రం వైఖరిపై  కాంగ్రెస్, టిఆర్ఎస్ లు దాదాపు ఏకాభిప్రాయంతో వ్యవహరిస్తున్నాయి.

 రెండు పార్టీలు  విడివిడిగా తమ అభిప్రాయాలను చెబుతున్నా.... సి ఏ ఏ,  ఎన్ పీఆర్, ఎన్సిఆర్ లాంటి అంశాలను కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా టిఆర్ఎస్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.

 అవసరమైతే జాతీయ స్థాయి లో సీఏ ఏ ను వ్యతిరేకించే పార్టీలను ఏకం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ తో మాట్లాడేందుకు కూడా వెనకడుగు వేయని ప్రకటించారు.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా ఈ రెండు పార్టీలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయాన్ని టిఆర్ఎస్ వ్యక్తం చేయగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేంద్రం వైఖరి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకు నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ లు రాష్ట్రంలో బద్ధ శత్రువులైనా జాతీయ రాజకీయాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఇరు పార్టీలు ఒకే అభిప్రాయంతో ఉంటున్నాయి.