Telangana: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో మెరుగైన ఫలితాలు రాబడుతోంది. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో తన అతిపెద్ద డేటాసెంటర్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది.
Telangana: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో మెరుగైన ఫలితాలు రాబడుతోంది. ఇప్పుడు అతిపెద్ద పెట్టుబడిని పొందేందుకు సిద్ధంగా ఉంది. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలోని తన అతిపెద్ద డేటాసెంటర్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. క్లౌడ్, ఆర్టిఫిసియల్ ఇంటలిజెంట్ (ఏఐ) ఆధారిత డిజిటల్ ఎకానమీ కస్టమర్లకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యూహాత్మకంగా ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. మైక్రోసాఫ్ట్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న క్లౌడ్, డేటా సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడెక్టివిటీ టూల్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్‌లో సర్వీసులను ఇది అందిస్తుంది. ఇది రాష్ట్రంలో కీలక పెట్టుబడి కానుంది.
హైదరాబాద్ రీజియన్‌లో నాల్గవ, అతిపెద్ద డేటాసెంటర్‌ను ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ 15 సంవత్సరాల వ్యవధిలో రూ.15,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్) తెలిపారు. "తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడిలో ఇదే అతిపెద్దది. హైదరాబాద్ ప్రాంతంలో అతిపెద్ద డేటాసెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఇది రాష్ట్ర ఐటీ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుంది" అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల వల్ల ఇండియాలో కొత్తగా 15 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఓ స్టడీ ద్వారా తేలింది. దీనికి తోడు 169000 కొత్త ఐటీ జాబ్స్‌ను ఇచ్చారు. రాబోయే డేటాసెంటర్ రాష్ట్రంలో 9.5 శాతం వృద్ధిని నమోదు చేసుకున్న ఐటీ రంగ ప్రగతికి మరింత ఊతమిస్తుందని మంత్రి తెలియజేశారు.
హైదరాబాద్‌ను డేటాసెంటర్‌గా ఎంపిక చేసిన మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్ణయం పట్ల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రానున్న అతిపెద్ద ఎఫ్‌డీఐ అవుతుందని ఆయన అన్నారు. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ వల్ల స్థానిక కంపెనీలకు క్లౌడ్ సర్వీసులు పెరగనున్నాయి. మైక్రోసాఫ్ట్, తెలంగాణకు సుదీర్ఘ చరిత్ర ఉందని, హైదరాబాద్‌లో అత్యంత పెద్ద డేటా సెంటర్‌ను ఆ కంపెనీ ఓపెన్ చేయడం సంతోషకరమని, తెలంగాణ-మైక్రోసాఫ్ట్ మధ్య రిలేషన్ పెరగడం ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగ పురోగతికి అన్ని రకాల చర్యలు తీసకుంటున్నామని ఆయన తెలిపారు.
