మగాళ్లకూ ఆర్టీసీ బస్సుల్లో స్పెషల్ సీట్లు ఇవ్వాలి - ఆర్మూర్ లో యువకుడి నిరసన
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మగాళ్లకూ ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు నిరసన చేపట్టాడు. మహిళలకు (mahalaxmi) ఉచిత బస్సు సౌకర్యం (free bus service)కల్పించడం వల్ల పురుషులకు సీట్లు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, రికార్డు స్థాయిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో అధికంగా మహిళలే ఉంటున్నారు. దీంతో సహజంగానే సీట్లన్నీ దాదాపుగా వారితోనే నిండిపోతున్నాయి. పురుషులకు చాలా తక్కువ సంఖ్యలో సీట్లు లభిస్తున్నాయి.
పెరుగుతున్న ధరలు, నిరుద్యోగమే లోక్ సభలో భద్రత ఉల్లంఘనకు కారణం - రాహుల్ గాంధీ
అయితే ఈ విషయంలో ఓ యువకుడు విసుగు చెందాడు. మగాళ్లకు బస్సులో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని నిరసన తెలిపాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. బస్సుకు అడ్డంగా నిలబడి ఆ యువకుడు తన ఆక్రోశాన్ని వెల్లగక్కాడు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల సీట్లన్నీ వారితోనే నిండిపోతున్నాయని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ కే అత్యధిక నిధులు..
దీని వల్ల పురుషులకు సీట్లు లభించడం లేదని అన్నారు. తన కూతురు, భార్య కూడా ఈ ఉచిత బస్సులో ప్రయాణిస్తారని, ఇది చాలా మంచి పథకమే అని అన్నారు. కానీ మగాళ్లకు కూడా సీట్లు లభించాలి కదా అన్నారు. ప్రతీ బస్సులో పురుషుల కోసం 15 సీట్లు అయినా కేటాయించాలని ఆ యువకుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ యువకుడి నిరసనతో కొంత సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఆర్థిక సాయం కోరుతున్న కాంగ్రెస్ పార్టీ.. 18 నుంచి ‘డొనేట్ ఫర్ దేశ్’ క్యాంపెయిన్ ప్రారంభం
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ‘మహాలక్ష్మీ’ పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. దీని ద్వారా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.